ETV Bharat / city

'పెట్టుబడి సాయం ఇతర రుణాలకు జమ చేయొద్దు' - సీఎంతో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం

సీఎం జగన్​ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ముగిసింది.  ఖరీఫ్ సీజన్ రుణ లక్ష్యం, కౌలురైతుల పెట్టుబడి సాయం, రైతు రుణాల పెండింగ్ అంశాలపై  బ్యాంకర్లతో సీఎం చర్చించారు. వచ్చే నెల నుంచి ప్రారంభంకానున్న రైతు భరోసాపై సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు సమాచారం. పెట్టుబడి సాయాన్ని ఇతర రుణాలకు జమ చేయవద్దని బ్యాంకర్లకు సీఎం స్పష్టం చేశారు.

సీఎంతో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం
author img

By

Published : Sep 25, 2019, 5:07 PM IST

సీఎంతో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్​రెడ్డి అధ్యక్షతన 208వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం(ఎస్​ఎల్​బీసీ) జరిగింది. సచివాలయం మొదటి బ్లాక్​లో నిర్వహించిన ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పంట సాగుదారుల హక్కు చట్టం 2019 ప్రకారం కౌలు రైతులకు పెట్టుబడి సాయం, రైతు రుణాల పెండింగ్ అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్​కు రూ.24వేల కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రుణ లక్ష్యానికి అనుగుణంగా బ్యాంకులు అందించాల్సిన సాయంపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. వచ్చే నెల 15వ తేదీ నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న వైఎస్సార్​ రైతు భరోసా అమలుపైనా ఎస్ఎల్​బీసీ సమావేశంలో బ్యాంకర్లకు సీఎం సూచనలు చేసినట్టు తెలుస్తోంది. రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే రూ.6,500 నగదును ఇతర రుణాలకు జమ చేయవద్దని ముఖ్యమంత్రి జగన్ బ్యాంకర్లకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

రుణాల పంపిణీ లక్ష్యానికి చేరువలో : సీఎం
ప్రభుత్వం, బ్యాంకర్లు కలిసి పనిచేస్తేసే విశ్వసనీయత నిలబడుతుందని సీఎం జగన్​ అన్నారు. వివిధ వర్గాల ప్రజలకు చేయూత అందించేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించామన్న సీఎం... సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరాలని స్పష్టం చేశారు. వడ్డీలేని రుణాల కింద డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందన్నారు. ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వడ్డీలేని రుణాల కింద ఇవ్వాల్సిన డబ్బును నిర్దేశించిన సమయానికి చెల్లిస్తామని హామీ ఇచ్చిన జగన్... ముద్ర పథకం రుణాల పంపిణీ విస్తృతపరచడంపై దృష్టి పెట్టాలని బ్యాంకర్లకు సూచించారు. చిన్నచిన్న దుకాణాలు, తోపుడు బండ్ల చిరువ్యాపారులకు గుర్తింపు కార్డులు అందిస్తామని సీఎం అన్నారు. ఖరీఫ్‌లో రుణాల పంపిణీ లక్ష్యానికి చేరువగా ఉందని బ్యాంకర్లు చెప్పడం సంతోషకరమని ముఖ్యమంత్రి అన్నారు.

ఇదీ చదవండి :

సచివాలయంలో బ్యాంకర్ల సదస్సు ప్రారంభం

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఐదుగురు వ్యక్తులకు గాయాలు.

విడపనకల్లు మండలం ఉండబండ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఉరవకొండ నుంచి ముగ్గురు విద్యార్థులు హర్ష, చంద్ర, రాజు, ఉండబండ గ్రామానికి వెళ్తుండగా పాల్తూరు నుండి మరో ఇద్దరు ద్విచక్రవాహనంపై వస్తుండగా ముందు వెళ్తున్న ఆటోను ఇరువురు గమనించక ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి దీంతో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Body:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 25-09-2019
sluge : ap_atp_71_25_accident_persons_injuries_AV_AP10097
cell : 9704532806
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.