ETV Bharat / city

మార్పు చూపించాం.. మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేశాం: సీఎం జగన్​

రాజకీయ వ్యవస్థలో వైకాపా ప్రభుత్వం మార్పు చూపించిందని.. ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేయగలిగాం అని అన్నారు సీఎం జగన్. మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేశామన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు చేతలతోనే సమాధానం ఇద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైకాపా ప్లీనరీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

జగన్
జగన్
author img

By

Published : Jul 9, 2022, 5:06 AM IST

'రాజకీయ వ్యవస్థలో మార్పు అంటే ఏంటో వైకాపా ప్రభుత్వం చూపించింది. అక్కాచెల్లెమ్మల సాధికారత అంటే ఇలా ఉంటుందని చూపించాం. రైతులపై మమకారముంటే ఇలా ఉంటుందని పరిపాలనలో చూపించాం. అన్ని రంగాలపైనా మనదైన ముద్ర వేయగలిగాం' అని వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆ పార్టీ శ్రేణులనుద్దేశించి అన్నారు. వైకాపా రెండు రోజుల ప్లీనరీ గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు సదస్సులో జగన్‌ ప్రారంభోపన్యాసం చేశారు. జగన్‌ తల్లి వైఎస్‌ విజయమ్మ కూడా మాట్లాడారు.

"నాకు వెన్నుదన్నుగా.. నాతో నిలబడిన ప్రతి ఒక్కరికీ ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా.. మీ వాడిగా, మీ ఆప్తుడిగా, మీ కుటుంబసభ్యుడిగా సెల్యూట్‌ చేస్తున్నా."

-సీఎం జగన్

పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య మొదలైన ఈ ప్లీనరీకి భారీసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. తొలిరోజు నాలుగు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ప్రారంభోపన్యాసంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ, ‘గ్రామపరిపాలన వ్యవస్థను ప్రజలకు చేరువగా, పారదర్శకంగా.. అవినీతి, వివక్ష లేకుండా ఎలా చేయగలమో, ఎలా మార్చామో వైకాపా ప్రభుత్వం చూపించింది. పరిపాలన సంస్కరణలంటే ఇలా ఉంటాయని చేసి చూపించింది. అవ్వాతాతల మీద మమకారం ఇలా ఉంటుందని చేసి చూపించింది. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యావిధానం ఇలా ఉంటుందని చేసి చూపించింది. వైద్య, ఆరోగ్య రంగం మీద ప్రేమ ఉంటే పరిపాలనలో ఇలాంటి మార్పులు చేస్తుందని చూపించింది. ప్రతీ పేదోడి సొంతింటి కలనూ నిజం చేయడం ఎలాగో చేసి చూపించింది. మూడేళ్లలో రెండు సంవత్సరాలు కరోనా సవాళ్లు విసిరినా, చంద్రబాబు రాష్ట్రాన్ని ముంచేసి పోయినా, వాళ్ల బకాయిలను మనమే కట్టాల్సి వచ్చినా, నవరత్నాల పాలన అందిస్తామని చెప్పాం, ఆ మాటను తు.చ. తప్పక అమలు చేశామని చెబుతున్నాను. ఇంతటి మార్పు గతంలో ఎప్పుడైనా చూశామా? అయినా గిట్టనివారు అసూయతో విమర్శిస్తున్నారు. మంచి చేసిన చరిత్ర, మాటకు విలువ ఇచ్చిన ·నైతికత ప్రతిపక్షానికి ఉన్నాయా’ అని సవాలు చేశారు.

.

మన చేతలతో సమాధానమిద్దాం

‘చెప్పిన వాటిలో ఒక్కటీ చేయకుండా మోసం చేసిన వారు... మేనిఫెస్టోలోని 95% హామీలను మూడేళ్లలోనే అమలు చేసిన మనపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు, ఆయన మనుషులు గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని బాగా మెక్కేశారు, నొక్కేశారు. ఇప్పుడు ఆ పంచుకోవడం ఆగిపోయింది. అందుకే వారికి నిద్ర పట్టడంలేదు. ప్రతి ఇంటికీ, ప్రతి సామాజికవర్గానికీ మంచి చేసి, మన చేతలతోనే వారికి సమాధానమిద్దాం’ అన్నారు.

మనం జనం గుండెల్లో.. వారు సామాజిక మాధ్యమాల్లో

‘మనం జనం గుండెల్లో, జనం ఇళ్లలో ఉన్నాం. గజదొంగల ముఠా సామాజిక మాధ్యమాల్లోనే ఉంది. మన చేతల పాలనకు, వారి చేతకాని పాలనకు మధ్య పోటీనా? మన నిజాలకు, వారి అబద్ధాలకు పోటీనా? మన నిజాయతీకి, వారి వంచనకు పోటీనా? మన గెలుపు ఆపడం వారివల్ల కాదు కాబట్టే రాక్షసమంద ఒక్కటవుతోంది. వీళ్లను నమ్మేవారు ఎవరూ లేరు కాబట్టే కులమతాల కుంపట్లు పెట్టి, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, వారికి తోడున్నవారు నాకు తోడుగా లేకపోవచ్చు. నాకున్నది మీ తోడు అని గర్వంగా చెబుతున్నా. ఆ దేవుడి దయ, మీ తోడు, ప్రజలందరి చల్లని దీవెనలు... ఈ మూడింటి మీదనే మీ జగన్‌ ఆధారపడతాడని సగర్వంగా తెలియజేస్తున్నా’ అని చెప్పారు.

.

ఇదీ చూడండి : వైకాపా ప్లీనరీలో.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.