రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద 2,434 జబ్బులకు చికిత్సలు ప్రారంభమైయ్యాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ వైద్య సేవల విస్తరణను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. అన్నిరకాల క్యాన్సర్ చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామని సీఎం తెలిపారు. హైదరాబాద్, బెంగళూరులోనూ ఆరోగ్యశ్రీ చికిత్సలు అందిస్తున్నామన్నారు.
ఇప్పటికే 7 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కింద 2434 వైద్య ప్రక్రియలకు చికిత్స అందిస్తున్నామన్నజగన్.. మరో 6 జిల్లాలో నేటి నుంచి 2434 జబ్బులకు చికిత్స ప్రారంభిస్తున్నామని తెలిపారు. అన్నిరకాల వైద్య చికిత్సలు ప్రతి ఆస్పత్రిలో నాణ్యతతో చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రభుత్వాస్పత్రుల్లో గతంలో మందులు వేసుకుంటే జబ్బు నయమయ్యేది కాదని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: ఈ ఏడాది ఇంజినీరింగ్ సీట్లలో భారీ కోత పడే అవకాశం!