ETV Bharat / city

అంబులెన్స్ కు దారిచ్చిన సీఎం కాన్వాయ్ - సీఎం జగన్ కాన్వాయ్ పై వార్తలు

గన్నవరం విమానాశ్రయం సమీపంలో సీఎం జగన్ కాన్వాయ్ ఓ అంబులెన్స్ కు దారి ఇచ్చింది. గూడవల్లి -నిడమానూరు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని అత్యవసరంగా ఆస్పత్రికి తరలించాల్సి రావటంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ కొద్దిగా వేగం తగ్గించుకుంది.

CM convoy leading to ambulance
అంబులెన్స్ కు దారిచ్చిన సీఎం కాన్వాయ్
author img

By

Published : Sep 2, 2020, 2:44 PM IST

Updated : Sep 2, 2020, 3:50 PM IST

కడప జిల్లా పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాన్వాయ్ ఓ అంబులెన్స్ కు దారి ఇచ్చింది. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్తుండగా గూడవల్లి-నిడమానూరు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని అత్యవసరంగా ఆస్పత్రికి తరలించాల్సి రావటంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ కొద్దిగా వేగం తగ్గించుకుని ఆంబులెన్స్ కు దారి ఇచ్చింది.

ఉయ్యూరు నుంచి బైక్​పై వెళ్తున్న ఓ వ్యక్తి గన్నవరం వద్ద ప్రమాదానికి గురయ్యారు. ఆయన్ను జాతీయ రహదారుల సంస్థకు చెందిన అంబులెన్స్ లో విజయవాడలోని ఈఎస్ఐ అస్పత్రికి తరలించారు. అదే సమయంలో సీఎం కాన్వాయ్ వెళ్తుండటంతో ముందుగా అంబులెన్స్ కు దారి ఇవ్వాలని సీఎం సూచన మేరకు కాన్వాయ్​ను పక్కకు తొలగించారు.

ఇదీ చదవండి: ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు

Last Updated : Sep 2, 2020, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.