హైదరాబాద్‌లో ఉంటూ ఏపీలో కుట్ర రాజకీయాలు చేస్తారా..! అంటూ వైకాపా అధినేత జగన్పై, సీఎం చంద్రబాబు మండిపడ్డారు. దొంగలకే దొంగ బుద్ధులు ఉంటాయని, నేరాలు చేసే బుద్ధి నేరగాళ్లకే ఉంటుందని అన్నారు. తెదేపాపై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ వద్దకు వైకాపా, భాజపా కలిసి వెళ్లాయని అన్నారు. ఆ రెండు పార్టీల ఉమ్మడి కుట్ర రాజకీయాలకు ఇదే రుజువని వ్యాఖ్యానించారు. కుట్రలు ఎదుర్కోవడం తెదేపాకు కొత్త కాదని అన్నారు. 37 ఏళ్ల శక్తి, సామర్థ్యంతో ఎన్ని కుట్రలైనా భగ్నం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెదేపా...బయోడేటా చూసి సీట్లు ఇస్తే, వైకాపా.. బ్యాలెన్సు షీట్లు చూసి సీట్లు ఇస్తోందని విమర్శించారు.
ఇదీ చదవండి.