తమ వంతు కృషి: ప్రజల తరఫున శాసనసభలో గొంతెత్తినందుకే.. ప్రభుత్వం కదిలిందని భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో చేసిన పాదయాత్రలో తన ముందుకొచ్చిన సమస్యలను సభ ముందుంచి పరిష్కారమయ్యేలా తమ వంతు కృషి చేసినట్టు వివరించారు.
"గత 7 రోజుల పాటు చేసిన పాదయాత్రలో.. ప్రజలు మా ముందుకు తీసుకువచ్చిన సమస్యలను శాసనసభలో మాట్లాడి వాటి పరిష్కారం కోసం కృషి చేశాం. నిరుద్యోగ సమస్యపై సభలో యువత తరఫున గళం వినిపించినందుకే.. ప్రభుత్వం 80 వేల ఉద్యోగాల ప్రకటన చేసింది. డబుల్ బెడ్ రూం ఇళ్లకు నిధులు కేటాయింపు.. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం లాంటి ప్రజా సమస్యలపై శాసనసభలో గొంతెత్తాం. నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలు విసిగిపోతున్నారు" - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇదీ చూడండి: Central on Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం మరో మెలిక..