ETV Bharat / city

అధిక ధరలకు మద్యం విక్రయం.. ప్రశ్నించినందుకు కస్టమర్లపై దాడి - attack on customers at darbar bar

Attack on customers at Bar: సండే సాయంత్రం సేద తీరేందుకు బార్​కు వెళ్లారు ఇద్దరు వ్యక్తులు. సిబ్బందిని బీర్లు అడిగారు. ఎంతైంది అని అడిగారు. వాళ్లు చెప్పిన ధర, బీర్​ బాటిల్​పై ఉన్న ధర చూశారు. రెండింటికీ పొంతన లేదు అనుకున్నారు. అధిక రేటుకు అమ్ముతున్నారు.. ఎంఆర్​పీ ధరకు విక్రయించాలని కస్టమర్లు డిమాండ్​ చేశారు. అంతే ఇక అక్కడి నుంచి మాటామాటా పెరిగి దాడి చేసే స్థితికి చేరుకుంది. హైదరాబాద్​లోని ఓ బార్​ వద్ద నెలకొన్న పరిస్థితి ఇది.

bar fight
bar fight
author img

By

Published : Jan 10, 2022, 6:24 PM IST

Attack on customers at Bar: ఎమ్మార్పీ ధరలకు మద్యం విక్రయించమని అడిగినందుకు కస్టమర్లపై దాడి చేశారు ఓ బార్​ నిర్వాహకులు. దీంతో బార్​ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల చొరవతో ఆందోళన సద్దుమణిగింది. హైదరాబాద్ మేడిపల్లి పీఎస్ పరిధిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్​కు ఆదివారం రాత్రి ఇద్దరు కస్టమర్లు వచ్చారు. బీరు అధిక ధరలకు అమ్ముతున్నారు, ఎంఆర్​పీ ధరలకు విక్రయించాలని కస్టమర్లు డిమాండ్ చేశారు. దీంతో అది గొడవకు దారితీసి, దాడి చేసే వరకు వెళ్లింది. ఘర్షణలో ‌సాయికృష్ణ అనే కస్టమర్​కు తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు‌.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం బార్​ ఎదుట ఆందోళన చేపట్టారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. కాగా ఈ బార్​ను​ ఓ వార్తా పత్రికకు చెందిన రిపోర్టర్ నిర్వహిస్తున్నారని.. బిహార్ వాసులను ఇక్కడ పనిలో పెట్టుకున్నారని.. ధరల విషయంలో ప్రశ్నించే కస్టమర్లపై దాడి చేయిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన బార్ నిర్వాహకుడిపై ఆందోళనకారులు దాడి చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న మల్కాజిగిరి పోలీసులు.. బార్​ నిర్వాహకుడిని పోలీస్​స్టేషన్​కు తరలించారు. కస్టమర్లపై దాడి చేసిన వారిని అరెస్టు చేసినట్లు ఏసీపీ శ్యాంప్రసాద్ రావు చెప్పారు.

ఇదీ చదవండి: కుటుంబం ఆత్మహత్య ఘటనలో నలుగురు వడ్డీ వ్యాపారులపై కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.