IAMC Inauguration in Hyderabad: హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని సీజేఐ ఎన్వీ రమణ ప్రారంభించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్ కేంద్రాలు లేనందున హైదరాబాద్‌లో ఏర్పాటుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద జూన్ 14న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. కేసీఆర్ వెంటనే అంగీకరించి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు.
IAMC in Nanakramguda: నగరంలోని నానక్‌రాంగూడలోని ఫీనిక్స్ వీకే టవర్‌లో 25 వేల చదరపు అడుగులతో ఐఏఎంసీని సిద్ధం చేశారు. ఐఏఎంసీ కేంద్రాన్ని నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీజేఐ ఎన్వీ రమణకు అప్పగించనున్నారు. అనంతరం వెబ్ సైట్‌ను కేసీఆర్ ప్రారంభిస్తారు. శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో భూమి కేటాయించనున్నట్లు ఈనెల 4న జరిగిన ఐఏఎంసీ పరిచయ కార్యక్రమంలో సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎంసీ ట్రస్టీలుగా ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హిమాకోహ్లి, మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్.రవీంద్రన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొంటారు.
ఇవీ చూడండి:
Amaravathi Farmers Sabha: తిరుపతి నడిబొడ్డున "సభా సంగ్రామం".. నలుదిక్కులా అమరావతి పొలికేక!