ETV Bharat / city

'డ్రగ్స్ కేసుతో ముడిపెట్టి కేటీఆర్‌పై వ్యాఖ్యలు చేయవద్దని ఉత్తర్వులు' - Drugs case updates

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​పై డ్రగ్స్ కేసును ముడిపెడుతూ తప్పుడు ఆరోపణలు చేయవద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. రేవంత్ రెడ్డి లేదా ఆయన అనుచరులు తనపై తప్పుడు ఆరోపణలు చేయకుండా నియంత్రిస్తూ ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలన్న కేటీఆర్ అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది.

KTR Defamation Suit On Revanth
KTR Defamation Suit On Revanth
author img

By

Published : Sep 21, 2021, 10:49 PM IST

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​పై డ్రగ్స్ కేసును ముడిపెడుతూ తప్పుడు ఆరోపణలు చేయవద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. రేవంత్ రెడ్డి లేదా ఆయన అనుచరులు తనపై తప్పుడు ఆరోపణలు చేయకుండా నియంత్రిస్తూ ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలన్న కేటీఆర్ అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది.

పిటిషన్ పూర్తిస్థాయి విచారణ కోసం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. కేసును అక్టోబరు 20కి వాయిదా వేసింది. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం దావా (KTR Defamation Suit On Revanth)పై సిటీ సివిల్ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. మంత్రిగా, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు రాష్ట్రంతో పాటు దేశవిదేశాల్లో తనకున్న పేరు, ప్రతిష్టలకు రేవంత్ రెడ్డి భంగం కలిగిస్తున్నారని కేటీఆర్ వాదించారు.

తనకెలాంటి సంబంధం లేని ఈడీ డ్రగ్స్ కేసుతో ముడిపెట్టి తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న సిటీ సివిల్ కోర్టు.. ఈడీ డ్రగ్స్​తో ముడిపెట్టి కేటీఆర్​పై తప్పుడు ఆరోపణలు చేయవద్దని రేవంత్ రెడ్డిని ఆదేశిస్తూ ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. తనపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పరువునష్టం చర్యలుగా ప్రకటించాలన్న ప్రధాన అభ్యర్థనపై విచారణ అక్టోబరు 20కి న్యాయస్థానం వాయిదా వేసింది.

కేటీఆర్ పిటిషన్​లో అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ రేవంత్ రెడ్డికి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. బేషరతుగా క్షమాపణలు చెప్పేలా రేవంత్ రెడ్డిని ఆదేశించాలని.. వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రధాన పిటిషన్​లో కేటీఆర్ కోరారు.

అసలు సంగతి ఇది..

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Twitter War Between Ktr and revanth reddy) మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఒకరు ట్వీట్‌ చేస్తే దానికి ప్రతిగా మరొకరు కౌంటర్‌ ఇచ్చారు. ఆ ఇద్దరి ట్వీట్ల వార్‌తో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. డ్రగ్స్‌ పరీక్షలపై రేవంత్‌రెడ్డి విసిరిన వైట్‌ ఛాలెంజ్‌పై కేటీఆర్ స్పందించారు. తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమేనని.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సిద్ధమా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. రాహుల్‌ ఒప్పుకొంటే దిల్లీ ఎయిమ్స్‌లో పరీక్షలకు తాను సిద్ధమనీ.. తనది చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారి స్థాయి కాదని స్పష్టంచేశారు. పరీక్షల్లో క్లీన్‌చిట్‌ వస్తే రేవంత్‌ క్షమాపణ చెప్పి పదవులు వదులుకుంటారా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో లై-డిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధమా' అని రేవంత్‌కు కౌంటర్‌ ఇచ్చారు.

ఇదీ చూడండి: KTR: డ్రగ్స్​ ఆరోపణలపై పరీక్షలకు రెడీ.. కాంగ్రెస్​ తరఫున రాహుల్​ గాంధీ సిద్ధమేనా?

రేవంత్ కౌంటర్..

దీనిపై స్పందించిన రేవంత్‌ రెడ్డి... సీఎం కేసీఆర్​తో కలిసి లై-డిటెక్టర్‌ పరీక్షకు తాను సిద్ధమని.. దీనికి సమయం, స్థలం చెప్పాలన్నారు. సీబీఐ కేసులు, సహారా పీఎఫ్ అక్రమాలు, ఈఎస్​ఐ ఆస్పత్రుల నిర్మాణంలో అక్రమాలపై లై-డిటెక్టర్‌ పరీక్షలకు కేసీఆర్ సిద్ధమా అని రేవంత్‌ సవాల్‌ విసిరారు.

ఇదీ చూడండి: KTR AND REVANTH TWITTER WAR: టాలీవుడ్​ డ్రగ్స్​ కేసు టు వైట్​ ఛాలెంజ్​ వయా ట్విటర్​ వార్​

కేటీఆర్ పరువు నష్టం దావా...

మరోవైపు రేవంత్‌ ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ మళ్లీ స్పందించారు. తనపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దుష్ప్రచారంపై కోర్టులో పరువునష్టం దావా వేసినట్లు తెలిపారు. దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. మాదకద్రవ్యాల కేసుతో ముడిపెడుతూ తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పరువునష్టం చర్యలుగా పరిగణించి పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పేలా రేవంత్‌రెడ్డిని ఆదేశించాలని కోరారు. తన పరువుకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను తొలగించేలా ఆదేశించాలన్నారు. తప్పుడు ఆరోపణలు చేయకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: కొప్పర్రు దాడి విచారణ వేగవంతం..16 మంది అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.