ఇవాళ ఉదయం మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామానికి చెందిన కిష్టయ్య చేపలు పట్టేందుకు హిమాయత్ సాగర్‌కు వెళ్లగా అక్కడ చిరుత కనిపించింది. కిష్టయ్య వెంటనే తన తమ్ముడికి ఫోన్ చేసి చెప్పాడు. అతని నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. కిష్టయ్యను వెంటబెట్టుకొని చిరుత కనిపించిన ప్రాంతంలో గాలింపు చేపట్టారు.
48 గంటలు దాటుతున్న చిరుత దొరక్కపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. రెండురోజుల క్రితం కాటేదాన్ వద్ద జాతీయ రహదారిపై లారీ డ్రైవర్‌పై దాడి చేసినప్పటి దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు...ఒకరు మృతి