"తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకు కరోనా సోకే అవకాశం ఉంది. నెలలు నిండిన శిశువుల్లో యాంటీబాడీస్ వచ్చే అవకాశం ఉంది. నెలలు నిండని శిశువులకు యాంటీబాడీస్ రావు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా 10-12 కేసులు ఉన్నాయి. మిస్సీ అనే వ్యాధి పిల్లల్లో ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటుంది. మిస్సీ వచ్చిన పిల్లలకు 4 నుంచి 6 వారాల క్రితమే కొవిడ్ సోకి ఉంటుంది. ఇలాంటి పిల్లలకు ప్రస్తుతం మిస్సీ లక్షణాలు బయటపడుతున్నాయి.జ్వరం, దురద, కాళ్లు చేతులకు వాపులు, నాలుక ఎర్రబడటం, పెదాలు పగిలిపోవడం, విపరీతమైన కడుపునొప్పి మిస్సీ లక్షణాలు. వ్యాధి లక్షణాలు గుర్తించగానే వైద్యం చేయిస్తే త్వరగా బయటపడొచ్చు. మిస్సీ వ్యాధికి వైద్యం కూడా మూడు, నాలుగు రకాలుగా ఉంటుంది. ఎంత త్వరగా వ్యాధి లక్షణాలు గుర్తిస్తే అంతా త్వరగా నయం చేయొచ్చు."-నియోనేటలాజిస్ట్ డాక్టర్ సతీష్
Remdesivir: బ్లాక్ మార్కెట్లో రెమ్డెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు