ETV Bharat / city

ఆంగ్ల మాధ్యమం తీసుకొస్తే తెలుగును అవమానపరిచినట్లా: జగన్

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకురావాలని తొలి అడుగు వేశామని సీఎం జగన్​ అన్నారు. ప్రతి పేరెంట్‌ కమిటీని అడిగితే 94 శాతం మంది ఆంగ్ల మాధ్యమం మంచి ఆలోచన అన్నారని..ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆపేందుకు కుట్ర పన్నారని సీఎం జగన్‌ విమర్శించారు.

author img

By

Published : May 27, 2020, 1:03 PM IST

Updated : May 27, 2020, 1:43 PM IST

CM Jagan Intellectual Conference on Education
విద్యారంగంపై ముఖ్యమంత్రి జగన్ మేధోమథన సదస్సు

విద్యారంగంపై 'మన పాలన-మీ సూచన' పేరుతో ముఖ్యమంత్రి జగన్ మేధోమథన సదస్సు నిర్వహించారు. ఇంటర్ తర్వాత ఉన్నత చదువులకు వెళ్లే వారి సంఖ్య పెంచాలని సూచించారు. పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామన్న సీఎం...పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదివేలా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలను చదివించాలని తల్లిదండ్రులకు ఆరాటం ఉన్నా సహకారం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని..ఆ పరిస్థితిని అధిగమించేలా చర్యలు ఉండాలన్నారు. పిల్లలకు చదువు లేకపోతే పేదవాళ్లు లాగానే మిగిలిపోతారని...వాళ్లు అలా కాకుండా ఉండాలంటే ప్రాథమిక స్థాయి నుంచే మార్పు తీసుకురావాలని తెలిపారు.

94 శాతం మంది మంచి ఆలోచన అన్నారు..

రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే.... సరైన సౌకర్యాలు ఉండట్లేదని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకురావాలని తొలి అడుగు వేశామని తెలిపారు. ప్రతి పేరెంట్‌ కమిటీని అడిగితే 94 శాతం మంది ఆంగ్ల మాధ్యమం మంచి ఆలోచన అన్నారని..ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆపేందుకు కుట్ర పన్నారని సీఎం జగన్‌ విమర్శించారు. ప్రభుత్వం వేసే ప్రతి అడుగులో అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని జగన్ ఆరోపించారు. ఆంగ్ల మాధ్యమం తీసుకొస్తే తెలుగును అవమానపరిచినట్లా అని సీఎం ప్రశ్నించారు. పెద్ద పెద్దవాళ్లంతా తమ పిల్లలను మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఆగస్టు 3నే జగనన్న విద్యా కానుక...

ఆగస్టు 3న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని..అదే రోజున జగనన్న విద్యా కానుక అందిస్తామని సీఎం తెలిపారు. 1 నుంచి ఇంటర్ చదివే పిల్లల తల్లిదండ్రులకు అమ్మఒడి కింద ఆర్థిక సాయమందిస్తామన్నారు. వచ్చే జనవరి 9న అమ్మఒడి డబ్బులు పిల్లల తల్లుల ఖాతాలో వేస్తామన్న జగన్...వచ్చే విద్యా సంవత్సరంలో పిల్లలకు 75 శాతం హాజరు తప్పక ఉండాలన్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంపై శిక్షణ ఇస్తున్నామని..పేద పిల్లల్లో మార్పు తీసుకురావాలనే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నామని సీఎం అన్నారు.

మూడు నెలలకొకసారి ఫీజు రీఎంబర్స్​మెంట్

పిల్లల తల్లిదండ్రులపై భారం పడకూడదనే పూర్తిగా ఫీజు రీఎంబర్స్ మెంట్ అమలు చేస్తామని...ఇకపై 3 నెలలకు ఓసారి చొప్పున ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లిస్తామని సీఎం తెలిపారు. వచ్చే సెప్టెంబర్‌లో విద్యార్థి తల్లి ఖాతాలో ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ మొత్తం వేస్తామన్నారు. ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కళాశాలలను ఏర్పాటుతో పాటు... జగనన్న వసతి దీవెన కింద పిల్లల తల్లి ఖాతాలో రూ.20 వేల వరకు జమ చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. కళాశాలల్లో అప్రెంటీస్‌ను తప్పనిసరి చేస్తున్నామన్న జగన్...చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దే విధంగా... ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిటీలు తీసుకొచ్చామన్నారు. 2020 ఫిబ్రవరిలో 62 పాఠశాలకు నోటీసులు జారీ చేశామని... 130 కళాశాలలు తనిఖీ చేసి 40 జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకున్నట్లు సీఎం వివరించారు. సౌకర్యాలు లేకపోతే రెగ్యులేటరీ మానిటరింగ్‌కు ఫిర్యాదు చేయవచ్చని జగన్ తెలిపారు.

ఇవీ చదవండి: 'సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా సీట్ల కేటాయింపులా..?'

Last Updated : May 27, 2020, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.