ETV Bharat / city

రోజుకు 20 కేసులు మాత్రమే విచారణ చేపట్టాలి: తెలంగాణ హైకోర్టు - Changes in the functioning of the courts

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నందున హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని న్యాయస్థానాలు, ట్రైబ్యునళ్ల నిర్వహణ విధానంలో మార్పులు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మాదిరిగా పరిమితంగా పని చేయాలని సూచించింది. కోర్టు ఆవరణలో ప్రతీ ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని హైకోర్టు తెలిపింది.

High court changes the timings
రోజుకు 20 కేసులు మాత్రమే విచారణ చేపట్టాలి
author img

By

Published : Apr 5, 2021, 7:49 PM IST

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నందున హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని న్యాయస్థానాలు, ట్రైబ్యునళ్ల నిర్వహణ విధానంలో మార్పులు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మాదిరిగా పరిమితంగా పని చేయాలని నాంపల్లి, రంగారెడ్డి జిల్లా సీబీఐ, అ.ని.శా. న్యాయస్థానాలకు హైకోర్టు స్పష్టం చేసింది.

ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులను రోజువారీగా కాకుండా వీలైనంత వేగంగా విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గతంలో కరోనా తీవ్రత తగ్గుతున్నప్పుడు మూడు దశల్లో కోర్టులను పునరుద్ధరించేలా హైకోర్టు ప్రణాళిక చేసింది. ఆ ప్రణాళిక ప్రకారం ప్రస్తుతం మూడో దశలో కోర్టులు పనిచేస్తున్నాయి. కొవిడ్ తీవ్రత పెరిగిన నేపథ్యంలో మళ్లీ మొదటి దశ ప్రకారం పనిచేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు.

మొదటి దశ విధివిధానాల ప్రకారం రోజుకు 20 కేసులకు మించి విచారణ జరపరాదు. కేసుకు సంబంధించిన న్యాయవాదులను మాత్రమే థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత కోర్టు హాల్​లోకి అనుమతిస్తారు. బార్ అసోసియేషన్ కార్యాలయాలు, క్యాంటిన్లను తెరవవద్దని స్పష్టం చేసింది. కోర్టు ఆవరణలో ప్రతీ ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని హైకోర్టు తెలిపింది.

ఇదీ చూడండి: కృష్ణపట్నం పోర్టులో అదానీ గ్రూప్‌ 100% పెట్టుబడులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.