ఇదీ చదవండి :
భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని చూపాలి: చంద్రబాబు - దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ
జనతా కర్ఫ్యూని విజయవంతం చేసిన ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు.
chandrababu tweet on janatha curfew over caroona affect
రాబోయే రోజుల్లో కూడా ఇవాళ్టి స్ఫూర్తినే చూపి కరోనాపై పోరాటాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతం చేసిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. "వైద్యో నారాయణో హరి:" అన్న ఆర్యోక్తిని నిజం చేస్తూ... కరోనా వ్యాధి బాధితులకు స్ఫూర్తిదాయక వైద్యసేవలు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తీరును అందిస్తోని కొనియాడారు. వారి సేవలను ప్రశంసిస్తూ కరతాళ ధ్వనులతో జేజేలు పలికిన అశేష ప్రజానీకానికి అభినందనలు తెలిపారు. ప్రతి కుటుంబంలో ఎవరికి వారు పరిశుభ్రత పాటించాలి, క్రమశిక్షణతో స్వీయ నియంత్రణ చేపట్టాలని చంద్రబాబు సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. కరోనా బారినుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని కోరారు. కరోనా ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోండని ఓ వీడియోను చంద్రబాబు ట్విట్టర్లో పోస్ట్చేశారు.
ఇదీ చదవండి :
Last Updated : Mar 23, 2020, 1:00 AM IST