అమరావతిని పోటీపడి అభివృద్ధి చేస్తారని ఆశించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నీరుగార్చడం ప్రజాద్రోహమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిపై అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలతో దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యక్తిపైనో, పార్టీపైనో కక్షతో చట్ట విరుద్ధంగా రాష్ట్ర రాజధాని నిర్మాణ బృహత్తర యజ్ఞాన్ని భగ్నం చేయడం తుగ్లక్ చర్యేనని ఆయన విమర్శించారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి 5 ఏళ్లు అయిందని గుర్తు చేసిన చంద్రబాబు... విభజన నష్టాన్ని అధిగమించి, 13 జిల్లాల అభివృద్ధికి సంపద సృష్టి కేంద్రంగా, యువత ఉద్యోగ అవకాశాల కార్యస్థానంగా రాజధాని నిర్మాణం తలపెట్టామన్నారు.
-
విభజన నష్టాన్ని అధిగమించి, 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన సంపద సృష్టి కేంద్రంగా, యువత ఉద్యోగ అవకాశాల కార్యస్థానంగా ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటికి 5 సంవత్సరాలు. మూడున్నర సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగిన రాజధాని నిర్మాణ పనులను గత ఏడాదిన్నరగా ఆపేశారు(1/4)
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) October 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">విభజన నష్టాన్ని అధిగమించి, 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన సంపద సృష్టి కేంద్రంగా, యువత ఉద్యోగ అవకాశాల కార్యస్థానంగా ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటికి 5 సంవత్సరాలు. మూడున్నర సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగిన రాజధాని నిర్మాణ పనులను గత ఏడాదిన్నరగా ఆపేశారు(1/4)
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) October 22, 2020విభజన నష్టాన్ని అధిగమించి, 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన సంపద సృష్టి కేంద్రంగా, యువత ఉద్యోగ అవకాశాల కార్యస్థానంగా ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటికి 5 సంవత్సరాలు. మూడున్నర సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగిన రాజధాని నిర్మాణ పనులను గత ఏడాదిన్నరగా ఆపేశారు(1/4)
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) October 22, 2020
మూడున్నర సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగిన నిర్మాణ పనులను గత ఏడాదిన్నరగా ఆపేశారని చంద్రబాబు విమర్శించారు. వేలాది కూలీలు, భారీ మెషీనరీతో, వాహనాల రాకపోకలతో కోలాహలంగా నిర్మాణ పనులతో కళకళలాడిన అమరావతిని స్తబ్దుగా చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శంకుస్థాపన వేడుకకు హాజరైన ప్రధాని, దేశ, విదేశీ ప్రముఖుల సందేశాల స్ఫూర్తిని కాలరాశారని ఆక్షేపించారు.
భావితరాల అవసరాలకు అనుగుణంగా, భారతదేశానికి గర్వకారణంగా నిలిచేలా రూపకల్పన చేయటంతో పాటు 13 వేల గ్రామాలు, 3 వేల వార్డుల నుంచి తెచ్చిన పవిత్ర మట్టిని, పుణ్య జలాలతో అభిషేకించి శక్తి సంపన్నం చేసిన ప్రాంతం అమరావతని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిని కాపాడుకోవడం ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడి కర్తవ్యం అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి : వరద బాధితులకు రామోజీ గ్రూప్ రూ.5 కోట్ల సాయం