పంట నష్టంపై చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలది దుష్ప్రచారమని... రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. రెండేళ్లలో ప్రభుత్వం రైతులకు రూ.83 వేల కోట్లు సాయం చేసిందన్న కన్నబాబు.. 2020 ఖరీఫ్ పంట నష్టం కింద రూ.1,820 కోట్లు చెల్లించినట్టు వెల్లడించారు. పీఎం ఫసల్ బీమా యోజన కింద మార్గదర్శకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు.
రెండేళ్లలో పంటనష్టం కింద రూ.3,800 కోట్లు బీమా చెల్లించామని మంత్రి కన్నబాబు వివరించారు. పంటల బీమా పరిహారం పంపిణీపై తెదేపా నేతలవి అబద్ధాలన్నారు కన్నబాబు. సగటు దిగుబడి అంచనాతో పరిహారం ఇస్తామని, దీనిపై వక్రీకరణ తగదని వ్యాఖ్యానించారు. తెదేపా ప్రభుత్వం పెట్టిన బకాయిలనూ వైకాపా ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. వైఎస్‌ఆర్ జలకళ కింద ఉచితంగా బోర్లు వేస్తున్నామన్న మంత్రి కన్నబాబు.. రూ.1,700 కోట్లతో ఉచితంగా మోటార్లు కూడా ఇస్తున్నామని వెల్లడించారు.
ఇదీ చదవండీ... వచ్చే నెలలో అమలు కానున్న పథకాలను ప్రకటించిన సీఎం