వైకాపా ఏడాది పాలనలో ప్రజలు ఎంతో విసుగెత్తిపోయారంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓ వీడియో విడుదల చేశారు. బూటకపు మాటలను నమ్మి ఎంత మోసపోయారో వీడియో చెబుతోందని పేర్కొన్నారు. తొలి ఏడాది పాలన ఏ ప్రభుత్వానికైనా కీలకమని ఆయన తెలిపారు. ట్రైలర్ చూస్తేనే ఇలా ఉంటే రాబోయే కాలం ఇంకెలా బెంబేలెత్తిస్తారో హతవిధీ అంటూ ట్వీట్ చేశారు. ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటూ హామీల వర్షం కురిపించిన జగన్.... గెలిచిన తరువాత షరతులు వర్తిస్తాయంటూ మొహం చాటేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. చంద్రబాబు విడుదల చేసిన వీడియోను లోకేశ్ కూడా తన ట్విటర్లో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి