అమరావతిలో పార్టీ ముఖ్య నేతలతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. చలో ఆత్మకూరు ఆందోళనల తదనంతర పరిణామాలపై చర్చించారు. పార్టీ కార్యకర్తలపై కేసుల పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. బాధితులకు వెంటనే న్యాయం చేయాలనీ.. దోషులను శిక్షించాలన్నారు. తెదేపా కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని మూర్ఖంగా ప్రవర్తించకూడని జగన్ను ఉద్దేశించి అన్నారు.
ఇవీ చదవండి..