తమిళనాడు సీఎం పళనిసామి, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లాకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తమిళనాడులో చిక్కుకున్న ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు చెందిన 1500 మంది భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ మే 3 వరకు పొడిగించినందున వారికి నిత్యావసరాలను అందించాలని సూచించారు. కూలీలందరూ చెన్నై, తమిళనాడు చుట్టుపక్కల ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. వారి యోగక్షేమాలపై కుటుంబసభ్యులు ఆందోళనతో ఉన్నారని చెప్పారు. తమిళనాడులో చిక్కుకున్నవారికి సంబంధించిన ఫోన్ నెంబర్లు, వివరాలను చంద్రబాబు జత చేశారు.
ఇదీ చదవండి: