కరోనా అనుమానం ఉన్న వారందరినీ ఒకే అంబులెన్స్ లో ఎక్కించటం దుర్మార్గమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. కరోనా కేసుల సంఖ్య పెరిగేకొద్దీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కాపాడే విషయంలో విఫలమవుతున్న తీరు బాధ కలిగిస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇక దేవుడే కాపాడాలన్నారు. 108 అంబులెన్స్‌ల ప్రచారానికి వెచ్చించిన ఖర్చు ఇందుకేనా అంటూ ధ్వజమెత్తారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు.
ఇదీ చదవండి : మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ