ETV Bharat / city

ఇళ్ల స్థలాల పేరుతో కోట్లు స్వాహా : చంద్రబాబు

పేదల ఇళ్ల స్థలాల భూసేకరణలోనూ వైకాపా అవినీతికి పాల్పడిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు. ఇళ్ల స్థలాల భూములను ప్రభుత్వం చేత అధిక ధరకు కొనిపించారని ఆరోపించారు. ప్రతి నియోజకరవర్గంలోనూ వందల కోట్లు స్వాహా చేశారని విమర్శించారు. తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లను పేదలకు అందించకుండా..నిరుపయోగంగా మార్చారని ఆక్షేపించారు. గత ప్రభుత్వంతో చేపట్టిన సామూహిక గృహ ప్రవేశాలు దేశానికే ఆదర్శమని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు
చంద్రబాబు
author img

By

Published : Jun 4, 2020, 3:27 PM IST

చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్

పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూసేకరణని వైకాపా నేతలు కుంభకోణంగా మార్చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. భూములను ప్రభుత్వంతో అధిక ధరకు కొనిపించి దోపిడీకి పాల్పడ్డారన్నారు. ఇళ్లస్థలాల పేరుతో ప్రతి నియోజకవర్గంలో వందల కోట్ల స్కామ్‌లు చేశారన్న చంద్రబాబు... ఆవ భూముల్లోనే రూ.400 కోట్లు కుంభకోణం చేశారని నిజనిర్ధరణ కమిటీ పేర్కొందన్నారు.

ఇప్పుడు పేదల నుంచి వసూళ్ల దందాకు వైకాపా తెరలేపిందని చంద్రబాబు ఆక్షేపించారు. పేదల సంక్షేమంలోనూ దోపిడీకి పాల్పడిన చరిత్ర వైకాపాదేనని ఘాటుగా విమర్శించారు. తెదేపాపై అక్కసుతో గతంలో పూర్తిచేసిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా కక్ష సాధిస్తున్నారన్నారు. తెదేపా హయాంలో కట్టిన ఇళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారని విమర్శించారు.

పేదల కోసం తెలుగుదేశం ప్రభుత్వం 29.52 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని గుర్తుచేసిన చంద్రబాబు.. 9.10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి 8 లక్షల గృహప్రవేశాలు జరిగాయన్నారు. మరో 20.41 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. తెలుగుదేశం 'సామూహిక గృహ ప్రవేశాలు' దేశానికే ఆదర్శ నమూనా అని చంద్రబాబు తెలిపారు. విశాఖ సహా ఉత్తరాంధ్ర, రాయలసీమలో లక్షలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చామన్నారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో మరో 98 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.