ETV Bharat / city

దళితులపై జరిగిన దాడులన్నింటిపైనా సీబీఐ విచారణ జరపాలి: చంద్రబాబు

రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలపై దాడులే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. 15నెలల్లో 150కిపైగా దాడులు, 4హత్యలు, 2శిరోముండనాలతో దమనకాండ సాగుతోందని ఆరోపించారు.

chandrababu fiers on ycp governament
chandrababu fiers on ycp governament
author img

By

Published : Sep 11, 2020, 3:47 PM IST

Updated : Sep 11, 2020, 7:54 PM IST

రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాలపై దాడులే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎస్సీలపై వైకాపా దమనకాండను నిరసిస్తూ 'తెలుగుదేశం దళిత శంఖారావం 'పేరిట చేపట్టిన కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ చంద్రబాబు మాట్లాడారు. నేరస్థుడు పాలకుడైతే నేరగాళ్లు ఎంతగా రెచ్చిపోతారో.. రాష్ట్రంలో జరుగుతున్న తాజా సంఘటనలే ఉదాహరణ అని దుయ్యబట్టారు.

దళితులపై జరిగిన దాడులన్నింటిపైనా సీబీఐ విచారణ జరపాలి: చంద్రబాబు

ఎస్సీలకు బాసటగా చలో ఆత్మకూరుతో పోరాటం ప్రారంభించామన్న ఆయన... 15 నెలల్లో 150కిపైగా దాడులు, 4 హత్యలు, 2 శిరోముండనాలతో, దమనకాండ సాగుతోందని ఆరోపించారు. అంబేడ్కర్ కలలు కని రాసిన రాజ్యాంగం ఇదేనా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. మొదటినుంచే సీరియస్​గా ఉంటే వరుస ఘటనలు జరిగేవి కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

దళితులపై జరిగిన దాడులన్నిoటిపైనా సీబీఐ విచారణ జరిపించాలి. బాధితులకు రూ.50లక్షల నుంచి రూ. కోటి పరిహారం ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు... అక్రమ కేసులు ఎత్తేసి బలవంతంగా లాక్కున్న భూములు వెనక్కి ఇవ్వాలి. అన్ని గ్రామాల్లో దళితులంతా ఆలోచన చేయాలి. వైకాపా ప్రభుత్వం వచ్చాక అదనంగా ఏమైనా చేకూరిందా అని బేరీజు వేసుకోవాలి. సంఘటితంగా పోరాడేందుకు కలసి రావాలి -చంద్రబాబు, తెదేపా అధినేత

ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎక్కడికక్కడ నిలదీయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దళితులంటే తనకు కట్టు బానిసలని ముఖ్యమంత్రి భావిస్తున్నారా..? అని దుయ్యబట్టారు. రోమ్ తగలపడుతుంటే ఫిడేల్ వాయించుకున్న రీతిలో సీఎం ఇంట్లో నోరు మెదపకుండా ఆనందంగా గడుపుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు చేయకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం ఉన్మాది అయితే ఊరికో ఉన్మాది పుట్టుకొస్తున్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై పార్లమెంట్​లోనూ గళం విప్పుతామన్న చంద్రబాబు...దిల్లీకి ప్రతినిధుల బృoదాన్ని పంపి దళిత ప్రయోజనాల కోసం పోరాడతామని చెప్పారు.

ఇదీ చదవండి

జగన్​కు బిహార్ సీఎం ఫోన్​...ఎందుకంటే..!

Last Updated : Sep 11, 2020, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.