ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కరోనా ఉద్ధృతి: చంద్రబాబు

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభంలోనూ వైకాపా నేతలు రాజకీయాలు చేస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైద్యులపై సైతం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కరోనా ఉద్ధృతి: చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కరోనా ఉద్ధృతి: చంద్రబాబు
author img

By

Published : Aug 18, 2020, 5:40 PM IST

రాష్ట్రంలో కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిర్థరణ పరీక్షల సంఖ్యను బాగా తగ్గించిందని విమర్శించారు. వైద్యులు, ఫ్రంట్ వారియర్లతో కరోనా నివారణపై తీసుకోవాల్సిన చర్యలపై.. చంద్రబాబు అభిప్రాయ సేకరణ జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్మాదంతో వ్యవస్థలన్నీ ధ్వంసం చేస్తోందని ఆగ్రహించారు. వైకాపా నేతలు తప్పు మీద తప్పు చేస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.

'ప్రభుత్వం నిర్లక్ష్యమే'

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మహారాష్ట్రతో సమానంగా ఏపీలో కరోనా కేసులు పెరిగాయని చంద్రబాబు అన్నారు. ప్రతి లక్ష జనాభాకు కేసుల సంఖ్యలో ఏపీ మొదటి స్థానంలో ఉందని.. పాజిటివిటీ రేటు 17.2, డబ్లింగ్ రేటు 12.8 శాతంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య 6 లక్షలు కానుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా సంక్షోభంలోనూ వైకాపా నేతలు రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టకుండా.. తెదేపా నేతలపై తప్పుడు కేసులు ఎలా పెట్టాలా.. వారిని జైళ్లకు ఎలా పంపాలా అని ఆలోచిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్​ వైఖరి వల్ల రాష్ట్రం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు.

'వైద్యులకు బెదిరింపులు'

విజయవాడలో డాక్టర్‌ రమేశ్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని... సినీ నటుడు రామ్ ట్వీట్ చేస్తే సినిమాలు ఆడనివ్వబోమని వైకాపా వ్యాఖ్యలు చేయడం హేయమంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కరోనా కంటే కుల వైరస్ ఉద్ధృతంగా ఉందని రామ్ ట్వీట్ చేయడం రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు.

'అవినీతిపై చర్యలేవీ..?'

తెలుగుదేశంపై తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన వైకాపా... గత 15 నెలలుగా అదే పద్ధతి కొనసాగిస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా అవినీతికి పాల్పడిందని... ఎకరం రూ.5 లక్షలు ఉండే భూమిని రూ.50 లక్షలకు కొన్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆధారాలతో సహా అవినీతి బయటపడినా ఇప్పటికీ చర్యల్లేవని మండిపడ్డారు.

ఇదీ చూడండి:

'ప్రధానికి లేఖ రాస్తే... డీజీపీ స్పందించడమేంటి?'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.