మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూతపై.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విలువలు కలిగిన నాయకుడిని దేశం కోల్పోయిందని ఆవేదన చెందారు. క్రమశిక్షణ, హుందాతనానికి ప్రణబ్ మారుపేరు అని కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
విద్యావేత్తగా.. నాయకుడిగా.. పాత్రికేయుడిగా.. మంత్రిగా.. రాష్ట్రపతిగా దేశానికి అత్యున్నత సేవలు అందించిన మహనీయుడు ప్రణబ్ ముఖర్జీ అని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కీర్తించారు. భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయన మృతి తీవ్రంగా బాధించిందని చెప్పారు. ప్రణబ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
యనమల విచారం.. సంతాపం
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటని... శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయనో రాజకీయ మేధావి అని కొనియాడారు. కేంద్ర మంత్రిగా ఆయన నిర్వర్తించిన బాధ్యతలను.. దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. ప్రణబ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.