పరిషత్ ఎన్నికల నిలుపుదల రాజ్యాంగ విజయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రభుత్వ అరాచకానికి హైకోర్టు ఉత్తర్వులు చెంపపెట్టని దుయ్యబట్టారు. తెదేపా ఎన్నికల బహిష్కరణ నిర్ణయం సరైనదిగా రుజువైనట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. కోర్టుల మార్గదర్శకాలు ధిక్కరించడాన్ని జగన్ ఇకనైనా మానాలని హితవు పలికారు.
ఎస్ఈసీ రబ్బరు స్టాంపుగా కాకుండా.. చట్ట ప్రకారం స్వతంత్రంగా వ్యవహరించాలని చంద్రబాబు పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి ఏడాది దాటిందన్న చంద్రబాబు... కొత్త ఓటర్లకు అవకాశమిచ్చేలా మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: