ఎక్కడైతే స్త్రీ సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు, రాష్ట్రం సంతోషంగా ఉంటాయని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పాలనలో మహిళల ప్రగతి, ఆనందమే లక్ష్యంగా పని చేశామని గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరు క్షణం నుంచే.... మహిళలు రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజధాని అమరావతి కోసం 82 రోజులుగా దీక్షలు చేస్తున్న మహిళలకు... అవమానాలు, అరెస్టులు, లాఠీదెబ్బలతో ప్రభుత్వం జవాబు చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తొమ్మిది నెలల కాలంలో 180 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని ట్వీట్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంతో సంతోషించాం కానీ సమాజాన్ని ఏ దిశకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. తెదేపా ఎల్లప్పుడూ మహిళలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : 'శ్రీజ'..వారు సరఫరాదారులే కాదు యజమానులు