కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన జాతీయ విద్యా విధానం 2020ను తెదేపా అధినేత చంద్రబాబు స్వాగతించారు. ఈ సంస్కరణ విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ విధానం పోటీ ప్రపంచంలో మన యువతకు మార్గం సుగమం చేస్తుందని నమ్ముతున్నట్లు చంద్రబాబు చెప్పారు.
నూతన విద్యా విధానం ఐదో తరగతి వరకు మాతృభాషను బోధనా మాధ్యమంగా నొక్కి చెబుతోందని చంద్రబాబు అన్నారు. మాతృభాషను బోధనా మాధ్యమంగా చేయడం కచ్చితంగా స్వాగతించే చర్యేనన్న ఆయన.. అక్షరాస్యత నైపుణ్యాలను పెంపొందించడానికి ఇది చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. పిల్లలు మంచి విద్యా పనితీరుకు దోహదపడే చక్కటి ఆలోచన ఈ విధానమని అన్నారు.
ఇదీ చూడండి..