ETV Bharat / city

chandrababu: అమరావతిని విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలనే కలను సాకారం చేశారు: చంద్రబాబు

author img

By

Published : Jun 28, 2021, 6:25 PM IST

అమరావతిని దక్షిణభారత విద్యాకేంద్రంగా మార్చాలనే తమ విజన్‌ నెరవేరిందని తెదేపా అధినేత చంద్రబాబు(chandrababu) అన్నారు. అమరావతిలో ఏర్పాటైన విద్యాసంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు ఏడాదికి రూ.50 లక్షలు వేతనం వచ్చే ఉద్యోగాలు సాధించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

chandrababu
చంద్రబాబు

అమరావతిని దక్షణ భారతదేశ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలని రూపొందించిన విజన్ ఫలాలు ఇప్పుడు సాకరమవుతున్నందుకు సంతోషంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(chandrababu) హర్షం వ్యక్తం చేశారు.

"అమరావతిలో ఏర్పాటైన విద్యాసంస్థల నుంచి విద్యార్థులు ఏడాదికి రూ.40 నుంచి 50లక్షల వేతనం పొందే అద్భుతమైన ఉద్యోగాలు పొందారని విని ఎంతో ఆనందించా. ఈ ప్రాంతంలో చదివిన చాలా మంది విద్యార్థులు తలెత్తుకునేలా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయటంతో పాటు విదేశాల్లోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు పొంది వారి తల్లిదండ్రులు గర్వపడేలా చేశారు. అపార ప్రతభ కనబరిచిన విద్యార్థులు, విద్యాసంస్థలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలకు నా శుభాకాంక్షలు." అని ట్విట్టర్​లో అభినందించారు.

ఇదీ చదవండి:

Farmers Problems: రాయితీ యంత్రాల్లేక రైతుల ఇబ్బందులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.