ETV Bharat / city

పార్టీకి నష్టం కలుగుతుందని భావిస్తే కఠినంగా వ్యవహరిస్తా: చంద్రబాబు - Mahanadu News

పార్టీ విషయంలో ఇకపై నిక్కచ్చిగా ఉంటూ.. నష్టం కలుగుతుందని భావిస్తే కఠినంగానే వ్యవహరిస్తానని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మెరుగైన ఫలితాలు రావాలంటే కార్యకర్తల్ని అనునిత్యం రక్షించుకుంటూ నిరంతరం శ్రమించాల్సిందేనని దిశానిర్దేశం చేశారు. పోరాడే యువతను గుర్తించి సంక్షోభాన్ని ఎదుర్కొని పార్టీకి అండగా నిలిచేవారిని ఆదరిస్తానని ప్రకటించారు. అధికారం అండతో ఏ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారో అదే చట్టాన్ని సమర్ధవంతంగా వినియోగించి తప్పుచేసిన వారికి చుక్కలు చూపిస్తానని చంద్రబాబు హెచ్చరించారు.

చంద్రబాబు
చంద్రబాబు
author img

By

Published : May 28, 2021, 7:57 PM IST

పార్టీ కోసం కష్టపడేవారిని విస్మరించే అవకాశం లేదని.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఎదుటివారికి సమాధానం చెప్పగలిగే వారిని గుర్తింపునిస్తూనే, అడ్డగోలుగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టబోనని హెచ్చరించారు. పార్టీని బలోపేతం చేసుకోవాలంటే అంతర్గత విభేధాలు విడిచిపెట్టాలని కోరారు. ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కారమయ్యాయన్న తెదేపా అధినేత... ఉన్నవాటిని త్వరలోనే పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. పార్టీ సంస్థాగత తీర్మానంపై జరిగిన చర్చలో తెలుగు రాష్ట్రాల నేతలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ఇన్​ఛార్జ్​లు లేని నియోజకవర్గాలకు నేతలను నియమించుకోవటం, పార్లమెంటు కమిటీల నియామకం త్వరలోనే పూర్తి చేయాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు సూచించారు. అనుబంధ సంఘాలను జూన్ చివరి నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు.

అధికారంలో ఉన్నపుడు ప్రజల కోసం ఆలోచించిన సమయంలో.. 10 శాతం పార్టీ కోసం పెట్టినా ఈ రోజు ఇబ్బందులు ఎదురయ్యేవి కాదని... చంద్రబాబు వ్యాఖ్యానించారు. దుర్మార్గుల మాటలు నమ్మి ఓట్లేసిన ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి మానసికంగా వేధిస్తున్నందున... ప్రత్యర్థి నాయకులతో పాటు పోలీసులపైనా ఎదురు కేసులు పెడదామని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఎలాగో... ఎదురు కేసులే వీరికి వ్యాక్సిన్ అన్నారు. చట్టాన్ని సమర్ధవంతంగా ఉపయోగించి తప్పు చేసినవారికి చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు.

తెలుగుదేశం పార్టీ ఏర్పడి వచ్చే మార్చి నాటికి 40 సంవత్సరాలు పూర్తవుతుందన్న చంద్రబాబు... విభజన తర్వాత ఏపీ, తెలంగాణలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో తెదేపా పాత్ర కనిపిస్తోందని, ఏపీలో అలాంటి స్థానం కోసం అనునిత్యం శ్రమించామన్నారు. ఇందిరాగాంధీ లాంటి మహామహుల్ని ఎదురొడ్డి నిలబడిన పార్టీ తెదేపా అని గుర్తుచేశారు. 70 లక్షల కార్యకర్తలు కలిగిన తెదేపా... ఏకాకి కాదని సంస్థాగత శక్తి అని ఉద్ఘాటించారు. సంవత్సరం పాటు పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. రెండేళ్లుగా కరోనా వేధిస్తున్నా.. సాంకేతికతను వాడుకుంటూ కార్యక్రమాలను సమర్థవంతంగా పార్టీ నిర్వహిస్తోందని చంద్రబాబు ప్రశంసించారు.

జిల్లాస్థాయి కమిటీలు, శాఖలు, అనుబంధ సంఘాలకు బదులుగా.. పార్లమెంటు స్థాయి కమిటీలు, శాఖలు, అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. సమాజానికి సేవ చేయాలంటే తెదేపాను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు రాష్ట్రానికి తీసుకువచ్చిన మంచిపేరును... జగన్‌మోహన్‌రెడ్డి నాశనం చేస్తున్నారని విమర్శించారు. మహానాడు పూరైన పదిరోజుల్లో పార్లమెంటరీ కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మరోసారి అరెస్ట్‌కు తాను సిద్ధమై పంచె, టీషర్టు సిద్ధం చేసుకున్నానని అచ్చెన్న వెల్లడించారు. స్వార్థం కోసం కొంతమంది నాయకులు పార్టీని వీడినా పటిష్టమైన కార్యకర్తల బలం ఉన్న తెదేపాకు ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తంచేశారు.

తెలంగాణలో తెలుగుదేశం బలోపేతానికి పెద్దపీట వేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.రమణ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో తెలంగాణలో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలోనే పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా కమిటీల ఏర్పాటు పూర్తిచేస్తామన్నారు. ప్రజల కష్టనష్టాల్లో ఎప్పుడూ అండగా ఉంటూ ప్రజావ్యతిరేక విధానాలమీద ఎప్పటికప్పుడు పోరాడతామని తెలిపారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా... పలువురు కార్యకర్తలు విరాళం ఇచ్చారు. గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో గుత్తికొండ శ్రీవల్లి, భార్గవరామ్, వీరభద్ర రావు, కృష్ణతేజ ఎన్టీఆర్ ట్రస్టుకు లక్ష, తెలుగుదేశం పార్టీకి 5లక్షలు విరాళం అందించారు. మహానాడు వేదిక వారికీ కృతజ్ఞత తెలిపింది.

ఇదీ చదవండీ... Jagan Review: కేంద్రం నుంచి పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.