ETV Bharat / city

'గిరిజనుల అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం కాలరాస్తోంది'

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. ఐదేళ్ల తెదేపా పాలనలో గిరిజనుల కోసం ఎన్నో పథకాలను తీసుకువస్తే...వైకాపా ప్రభుత్వం అన్నింటినీ నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

author img

By

Published : Aug 9, 2020, 3:59 PM IST

chandrababu and lokesh
chandrababu and lokesh

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. వైకాపా పాలనలో గిరిజనుల అభివృద్ధిని కాలరాయడం బాధాకరమని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అనేక గిరిజన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని, వారి భద్రతనే ప్రశ్నార్థకం చేశారని మండిపడ్డారు. ఇటీవలే కర్నూలులో భర్త కళ్లెదుటే గిరిజన ఆడబిడ్డ గ్యాంగ్ రేప్, నకరికల్లులో ఒక గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపడం, గిరిజన రిజర్వేషన్లపై జీవో-3 రద్దు వంటి ఘటనలు కలిచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం గిరిజనుల పట్ల బాధ్యతతో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులు అందరికీ శుభాకాంక్షలు. అడవి బిడ్డలైన గిరిజనులు ప్రకృతి ప్రేమికులు, ఏ కల్మషం లేనివారు. తెలుగుదేశం హయాంలో గిరిజనుల సంక్షేమానికి రూ14,210కోట్లు వ్యయం చేశాం.(1/4)#WorldTribalDay

    — N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆదివాసీల బతుకుల్లో నవోదయాన్ని తెచ్చిన తెలుగుదేశం పాలనకు, గిరిజనులపై అహంకారపూరిత దౌర్జన్యాలకు ఆస్కారం ఇస్తోన్న వైకాపా పాలనకు ఎంతో తేడా ఉందని లోకేశ్ అన్నారు. ఇప్పటి నుంచైనా గిరిజనుల పట్ల పాలకుల దృక్పథం మారాలని ఆకాంక్షించారు.

  • ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ముందు ఏపీలో ఇలాంటి వార్తలు వినాల్సి వచ్చినందుకు బాధగా ఉందిఆదివాసీ బతుకుల్లో నవోదయాన్ని తెచ్చిన తెలుగుదేశం పాలనకు, గిరిజనుల పై అహంకారపూరిత దౌర్జన్యాలకు ఆస్కారం ఇస్తోన్న వైసీపీ పాలనకు ఎంత తేడా?(2/3)

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి

కొవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. 10కి చేరిన మృతుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.