మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. శాస్త్రవేత్తగా, ప్రజల రాష్ట్రపతిగా ఆయన చేసిన కృషిని ప్రశంసించడానికి ఏ పదాలు సరిపోవని చంద్రబాబు అన్నారు. కలాం మాటలు, పనులు గొప్ప వారసత్వాన్ని ముందుకు తీసుకువెళతాయని కొనియాడారు.
మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ప్రజల రాష్ట్రపతి అబ్దుల్ కలాం దూరమై ఐదేళ్లు గడిచిందంటే నమ్మలేకపోతున్నానని లోకేశ్ తెలిపారు. ఆయన్ని చూడటం, వినడం, రచనలను చదివే అదృష్టం ఉన్న ప్రతి భారతీయ పౌరుడిపై చెరగని ముద్ర వేశారన్న లోకేశ్... కలాంను కోల్పోవడం బాధాకరమన్నారు.
ఇదీ చదవండి:
పథకాలన్నింటికి జగన్ పేరు పెట్టుకోవడం అలవాటైంది: ఎంపీ రఘురామకృష్ణరాజు