ETV Bharat / city

ప్రధాని మోదీ ఆలోచనను సమర్థిస్తున్నాం: చంద్రబాబు

వైకాపా ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ నిర్ణయాలపై మండిపడ్డారు. ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు.

author img

By

Published : Nov 8, 2019, 6:52 PM IST

Updated : Nov 8, 2019, 11:41 PM IST

chandrababu about pm modi and ycp govt

తమ అక్రమాలు మీడియాలో వస్తాయనే వైకాపా ప్రభుత్వం మీడియాపై ఆంక్షల జీవో తెచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రభుత్వ పనితీరుపై ఆయన మండిపడ్డారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రభుత్వ తప్పుడు నిర్ణయమని.. ఇలాంటి చర్యలతో తెలుగు తన ఉనికిని కోల్పోతుందని అన్నారు. ముందస్తు ఏర్పాట్లు లేకుండా ఆంగ్ల మాధ్యమం ఇబ్బందికరమన్నారు.

భాషను కాపాడుకోకపోతే.. తెలుగు ఉనికిని కోల్పోతుంది:చంద్రబాబు

జేసీ, అఖిలప్రియ, చింతమనేనిని వైకాపా ప్రభుత్వం వేధిస్తోందని ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్‌పై సీఎం జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హిందూ ధార్మిక సంస్థల పరిరక్షణలో అలసత్వం వహిస్తున్నారని... అన్యమతస్థులపై ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక సమస్య తీవ్రంగా ఉందన్న చంద్రబాబు.. భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగానే దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు.

ఆర్థిక మూలాలపై దెబ్బతిస్తున్నారు:చంద్రబాబు

మన దేశంలో 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యమేనన్న తెదేపా అధినేత.. ప్రధాని మోదీ, కేంద్రం ఆలోచనను సమర్థిస్తున్నట్లు తెలిపారు. ఎలా సాధ్యమనే దానిపై తెదేపా తరపున డాక్యుమెంట్ ఇస్తామని వెల్లడించారు.

ఇప్పుడు రమణదీక్షితులు ఆగమపండితులా?:చంద్రబాబు
స్పీకర్ హుందాతనాన్ని పెంచండి:చంద్రబాబు
అమరావతిని నాశనం చేసేస్తున్నారు​:చంద్రబాబు

ఇదీ చదవండి: 'ఆంగ్ల మాధ్యమ జీవో.. తెలుగు ఉనికికే ప్రమాదం'

Intro:Body:Conclusion:
Last Updated : Nov 8, 2019, 11:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.