వైకాపా ప్రభుత్వం అమాయక వ్యక్తులపై చర్యలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో సస్పెండ్ అయిన టీచర్ నూకల వెంకటేశ్వరరావును చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. కేవలం డాక్టర్ రమేష్ గురించి ప్రెస్మీట్లో నిజాలు మాట్లాడినందుకు మరో రెండు నెలల్లో టీచర్‌గా రిటైర్మెంట్ కాబోతున్న వెంకటేశ్వరరావును అన్యాయంగా సస్పెండ్ చెయ్యడం దారుణమన్నారు. టీచర్ కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి