CBN Meeting with Verification Committee : ఈనెల 18న చంద్రబాబుకు కొవిడ్ నిర్ధరణ కాగా ఆయన హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందారు. ఏడు రోజుల అనంతరం చంద్రబాబుకు మళ్లీ కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ గా ఫలితాలు వచ్చాయి. ఆయన కరోనా బారి నుంచి కోలుకున్నారు.తిరిగి చంద్రబాబు తన విధుల్లో నిమగ్నం కానున్నారు. నేడు నిజనిర్థరణ కమిటీ సభ్యులతో తన నివాసంలో మధ్యాహ్నం ఆయన భేటీ కానున్నారు. కమిటీ నివేదిక, తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు అందించే ఉచిత వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున బాధితులు ఉచిత వైద్య సేవలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. తెదేపా, ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో అమెరికా ప్రముఖ వైద్యుల ద్వారా వైద్యసాయం, టెలిమెడిసిన్ విధానంలో కొవిడ్ బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నటలు చంద్రబాబు వివరించారు.రోజూ ఉ. 7.30 గం.కు జూమ్ కాల్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. జూమ్ లింక్ https://us02web.zoom.us ను చంద్రబాబు వెల్లడించారు.
ఇదీ చదవండి : YSR EBC Nestham scheme: నేడు 'వైఎస్సార్ ఈబీసీ నేస్తం' నిధులు జమ
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!