ETV Bharat / city

'దేవుళ్ల చిత్రాలు చెరిపి.. వైకాపా రంగులు వేయడం దుర్మార్గం'

Chandra Babu Naidu: తిరుపతిలో హిందూ దేవుళ్ల చిత్రాల స్థానంలో వైకాపా రంగులు వేయడంపై తెదేపా అధినేత ట్విట్టర్​లో స్పందించారు. ఇది చూసిన భక్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని ట్విటర్​​లో పేర్కొన్నారు.

Chandra Babu Naidu
చంద్రబాబు
author img

By

Published : Sep 28, 2022, 8:07 PM IST

Updated : Sep 29, 2022, 7:28 AM IST

Chandra Babu Naidu Tweet: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం మార్గంలో గోడలపై ఉన్న హిందూ దేవుళ్ల చిత్రాలను తొలగించి.. వైకాపా రంగులు వేయడం హిందూ మతాన్ని అవమానపరచడమేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘హిందుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని జగన్‌ చేస్తున్న పనులపై భక్తులు ఆగ్రహంగా ఉన్నారని బుధవారం ట్విటర్‌లో మండిపడ్డారు. రంగులు వేయక ముందు గోడపై హిందూ దేవుళ్ల చిత్రాలు ఉన్న ఫొటో, పార్టీ రంగులు వేసిన తర్వాత ఫొటోలను తన ట్వీట్‌కు జత చేశారు.

  • Shocked to see images of Hindu Gods & Goddesses in the temple town of #Tirupati being replaced with party colours of ruling YSR Congress Party. Devotees are seething with anger over these targeted acts of insulting Hinduism. pic.twitter.com/rdqH6xV1hx

    — N Chandrababu Naidu (@ncbn) September 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

* అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తానా బోర్డు డైరెక్టర్‌ డా.కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‌ భార్య, ఇద్దరు కుమార్తెల మృతి కలచివేసిందని చంద్రబాబు తెలిపారు. సాయం అందించడంలో, సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందు ఉండే నాగేంద్ర కుటుంబానికి ఇలా జరగడం విచారకరమని పేర్కొంటూ బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు.

* ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మరణం విచారకరమని చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఈ బాధ నుంచి బయటపడేలా కృష్ణ కుటుంబసభ్యులకు భగవంతుడు ధైర్యం అందించాలని ట్వీట్‌లో పేర్కొన్నారు.

వైకాపావాళ్లు దిగజారి ప్రవర్తిస్తున్నారు: అచ్చెన్నాయుడు

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు

వైకాపా నేతలు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో రోజురోజుకీ దిగజారి వ్యవహరిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, సీబీఐ, ఈడీ కేసులు, న్యాయస్థానం చీవాట్లపై ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక అధికార పార్టీ నేతలు నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నారని బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ‘తమ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా.. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతాం. అధికార పార్టీ నాయకులు తమ వైఖరి మార్చుకోకపోతే రాజకీయాల్లో ఉండే అర్హతను సైతం కోల్పోతారు’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు?: కనకమేడల

కనకమేడల
కనకమేడల

ఈనాడు డిజిటల్‌, అమరావతి: 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతామని ప్రతిపక్షంలో ఉండగా ప్రగల్బాలు పలికిన జగన్‌.. నేడు 31 మంది ఎంపీలుండి సాధించింది శూన్యమని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్‌ విషయంలో కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఈ మూడున్నరేళ్లు విభజన హామీల సాధనకు పాతరేసిన జగన్‌రెడ్డి.. విశాఖ ఉక్కు, రైల్వే జోన్‌లపై కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. మంగళగిరిలో ఆన్‌లైన్‌ ద్వారా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

జ్వరం మాత్రలూ ఇవ్వలేని ఆసుపత్రులు ఎందుకు?
సీఎంకు ఎమ్మెల్యే అనగాని లేఖ

రాష్ట్రంలో అంటువ్యాధులు విజృంభిస్తూ ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే బాధితులకు కనీసం జ్వరం మాత్రలు ఇవ్వలేని ప్రభుత్వాసుపత్రులు ఎందుకని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విషజ్వరాల విజృంభణ, మన్యంలో పెరుగుతున్న మరణాలు, గ్రామాల్లో అధ్వానంగా మారిన పారిశుద్ధ్య వ్యవస్థ, ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు కనీస వైద్యం అందకపోవడం, తదితర సమస్యలపై సీఎం జగన్‌కు బుధవారం బహిరంగ లేఖ రాశారు. ‘‘ఈ ప్రభుత్వం దోమలనూ నివారించలేని స్థితిలో ఉంది. 15వ ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ఫ్యామిలీ డాక్టర్‌, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల పేరుతో హడావిడి చేస్తున్న ప్రభుత్వం ఆచరణలో రోగులకు వైద్యం అందించలేకపోవడం సిగ్గుచేటు...’’ అని లేఖలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 29, 2022, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.