విశాఖలోని మానసిక వికలాంగుల పాఠశాల నిర్మాణాల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. విభిన్న ప్రతిభావంతుల పాఠశాల నిర్మాణాల కూల్చివేత దారుణమని ఆయన ఆవేదన చెందారు.
లాభాపేక్ష లేకుండా విభిన్న ప్రతిభావంతుల కోసం హిడెన్ స్ప్రౌట్స్ పాఠశాల నిర్వహిస్తున్నారని తెలిపారు. పేద కుటుంబాలకు చెందిన 190 మంది సేవలు పొందుతున్నారని.. నష్టపోయిన బాధిత వర్గానికి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని లేఖలో కోరారు. ల్యాండ్ మాఫియాతో అధికారులు చేతులు కలిపారని ఆరోపించిన చంద్రబాబు.. వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: