రాష్ట్రంలో ప్రస్తుతం రాజ్యాంగ తప్పిదాలు జరుగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ గౌరవాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని సూచించారు. స్వాతంత్య్ర ఉద్యమస్ఫూర్తితో రాజ్యాంగ రక్షణకు ప్రజలు మందుకు సాగాలని హితవు పలికారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో చంద్రబాబు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు.
పౌరుల స్వేచ్ఛకు యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతుంటే పోలీసులు అందుకు సహకరిస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అధికారులు, ఉద్యోగులు పని చేయాల్సింది ఎన్నికల కమిషన్ పరిధిలోనే అని గుర్తు చేశారు.
"సీఎం జగన్ పాల్పడుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలకు ప్రాణాలు అడ్డుపెట్టైనా అడ్డుకుంటాం" అని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేసారు. డీజీపీకి అరెస్ట్ వారెంట్ అనే పరిస్థితి రాష్ట్రంలో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఐపీసీ బదులు జగన్ పీనల్ కోడ్ అమలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో రైతులు రోడ్డెక్కి పరిస్థితి మంచిది కాదని... కేంద్రం రైతుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
ఇదీ చదవండి: విజయవాడలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన గవర్నర్