ETV Bharat / city

'ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలపై కేసులా?' - doctor madabhushi sridhar latest news

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తే కేసులు పెట్టడం అనేది అధికార దుర్వినియోగమని కేంద్ర మాజీ సమాచార కమిషనర్​ డాక్టర్​ మాడభూషి శ్రీధర్​ అభిప్రాయం వ్యక్తం చేశారు. కులమతాల ప్రాతిపదికన ప్రజల్లో ద్వేషభావాలు రెచ్చగొట్టినా, విభేదాలు, విద్వేషాలు సృష్టించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా, ప్రచారం చేసినా చట్టప్రకారం శిక్షార్హమన్నారు. వాటి వల్ల విద్యేషాలు చెలరేగి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసినప్పుడే ఐపీసీ సెక్షన్ల ద్వారా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.

centre informaion ex commissioner madabushi sridhar talks about postings in social media, ipc and constitution
కేంద్ర మాజీ సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌
author img

By

Published : May 24, 2020, 9:01 AM IST

Updated : May 24, 2020, 10:30 AM IST

సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేసిన వారిపై ఐపీసీ, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్లు ప్రయోగించడం, కేసులు పెట్టడం అధికార దుర్వినియోగమేనని కేంద్ర మాజీ సమాచార కమిషనర్‌, ప్రముఖ న్యాయశాస్త్ర ఆచార్యులు డాక్టర్‌ మాడభూషి శ్రీధర్‌ అభిప్రాయపడ్డారు. కులమతాల ప్రాతిపదికన ప్రజల్లో ద్వేషభావాలు రెచ్చగొట్టినా, విభేదాలు, విద్వేషాలు సృష్టించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెట్టినా, ప్రచారం చేసినా చట్టప్రకారం శిక్షార్హమన్నారు. ఆ పోస్టుల వల్ల విద్వేషాలు చెలరేగి తక్షణం హింసాకాండకు దారితీసే పరిస్థితులు ఉన్నప్పుడే వారిపై ఐపీసీ సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో అశ్లీల ప్రచారం చేసినా ఐపీసీ, ఐటీ సెక్షన్ల ప్రకారం చర్యలు చేపట్టవచ్చన్నారు. కేవలం ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించినవారిని, విమర్శించినవారిని హింసించడానికి ఆ సెక్షన్లను దుర్వినియోగం చేయడం దారుణమని మాడభూషి అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు, విమర్శలు చేశారంటూ కేసులు పెడుతున్న తీరుపై ఆయన మాట్లాడారు.

  • చట్టం తెలుసుకుని కేసులు పెట్టాలి

‘ప్రభుత్వాలు వ్యంగ్యాన్ని, విమర్శను ద్వేష రచనగా పరిగణిస్తున్నాయి. గుంటూరుకు చెందిన రంగనాయకమ్మపై వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ పోలీసులిచ్చిన నోటీసులు చూస్తే.. ప్రభుత్వాన్ని విమర్శించినందుకే కేసు పెట్టినట్టుగా ఉంది. ప్రభుత్వాన్ని విమర్శించినందుకే అలాంటి సెక్షన్లు పెడితే అది తీవ్ర నేరమే అవుతుంది. ఆ కేసు కోర్టులో నిలబడదు.

భారత రాజ్యాంగం.. ప్రతి పౌరుడికీ భావప్రకటన స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా కల్పించింది. విమర్శను విద్వేష భావనగా చూపించి ఆ హక్కుకు భంగం కలిగించే అధికారం ప్రభుత్వానికి లేదు. విమర్శలో వాస్తవం లేదనుకుంటే నిజమేంటో ప్రభుత్వం చెప్పాలి. పోలీసులు ఏ సెక్షన్లను ఏ సందర్భాల్లో ప్రయోగించాలో తెలుసుకోవాలి. చట్టం తెలిసినవారు, అడ్వొకేట్‌ జనరల్‌, ప్రభుత్వ న్యాయవాదులు పోలీసులకు మార్గదర్శనం చేయాలి. అదేమీ చూసుకోకుండా అసందర్భమైన సెక్షన్లు ప్రయోగించడం, అరెస్ట్‌ చేయడం.. ప్రజల వాక్‌, వ్యక్తి స్వాతంత్య్రాలను హరించడమే. ప్రచురణ, ముద్రణతో పాటు, హరికథ, బుర్రకథ వంటి ఇతర మాధ్యమాల ద్వారానూ పౌరులు భావాల్ని అభివ్యక్తీకరించే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించింది. అది సామాజిక మాధ్యమాలకూ వర్తిస్తుంది.

  • పీసీబీ చేసింది తప్పు

ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ ఉదంతంలో కంపెనీపై బాధితులు కోర్టుకెళ్లి, వారికి న్యాయం జరగాలంటే పదేళ్లు పట్టేది. న్యాయపోరాటానికే వారికి రూ.లక్షల్లో ఖర్చయ్యేది. కానీ చనిపోయినవారి కుటుంబాలకు రూ.కోటి పరిహారాన్ని తక్షణమే అందించడం ప్రభుత్వం చేసిన గొప్ప పని. మిగతా విషయాల్లో మాత్రం లోపాలున్నాయి. పర్యావరణ అనుమతి లేకుండా ఆ పరిశ్రమలో ప్రమాదకర రసాయనాల్ని ఉత్పత్తి చేయడం నేరం. ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో ప్రమాదకర రసాయనాల ఉత్పత్తికి కాలుష్య నియంత్రణ మండలి అనుమతిచ్చింది. తనకు అధికారం లేకపోయినా ఆ అనుమతులివ్వడం పీసీబీ చేసిన తప్పు. అలాంటి విషయాల్ని ప్రశ్నించినవారిపై ఐపీసీ, ఐటీ సెక్షన్లను వాడకూడదు.

  • పోస్టులు పెట్టేటప్పుడు సంయమనం పాటించాలి

సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారూ సంయమనంతో వ్యవహరించాలి. విమర్శ నిర్మాణాత్మకంగా ఉండాలి. ఎవర్నీ కించపరిచేలా, పరుష పదజాలంతో కూడిన భాష వాడకూడదు. కాళోజీ ఒక సందర్భంలో ‘నువ్వు పోరడివా? పౌరుడివా?’ అన్నారు. పురంలో ఉండదగ్గ లక్షణాలు ఉన్నవాడు పౌరుడు. ప్రతి ఒక్కరూ బాధ్యతల్ని గుర్తెరిగి నడుచుకోవాలి. రాజ్యాంగంలోనే అన్నీ రాయరు’ అన్నారు.

ఇదీ చదవండి :

గోరంట్ల బుచ్చయ్యపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు!

Last Updated : May 24, 2020, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.