కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. విజయవాడ చేరుకున్న ఆమెకు.. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్, నూజివీడు సబ్ కలెక్టర్, భాజపా నేతలు స్వాగతం పలికారు. అనంతరం జక్కులనెక్కలం వ్యవసాయక్షేత్రంలో రైతులతో నిర్మలాసీతారామన్ మాట్లాడారు. ఆమెకు రైతులు తమ బాధలు చెప్పుకొన్నారు. మద్దతు ధర రావట్లేదని కొందరు.. పంట కొనుగోళ్ల గురించి మరికొందరు గోడు వెల్లబోసుకున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో అధికారులతో నిర్మలా సీతారామన్ సమావేశం కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు రైతులు, రైతు ప్రతినిధులు, వ్యవసాయ రంగ నిపుణులతో భేటీ అవుతారు. వెన్యూ కన్వెన్షన్ హాలులో వ్యవసాయ బిల్లుల అంశంపై వ్యవసాయ రంగ నిపుణులతో సమావేశమవుతారు.
ఇదీ చదవండి: బహిరంగ ప్రదేశాల్లో నిరసనలపై సుప్రీం కీలక తీర్పు