తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనను ఇప్పటి వరకు కలవలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తనను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమేనని తెలిపారు. ఎప్పుడు కలుస్తామన్నది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు.
ఈ సందర్భంగా ఈటలతో కలిసి 15 ఏళ్లు పని చేశానన్న కిషన్ రెడ్డి.. కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కలిసినంత మాత్రాన పార్టీలో చేరతారని భావించలేం కదా అని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వస్తే పోటీలో ఉండాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
ఇదీ చదవండి: