ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన హాజరై ప్రసంగించారు. తెలుగువారు అనేక దేశాలు, రాష్ట్రాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. పాలనా సౌలభ్యం కోసమే తెలుగు రాష్ట్రాల ఏర్పాటు జరిగిందని వెల్లడించారు. విడిపోయామనే భావన లేకుండా తెలుగువారంతా కలిసిమెలిసి ఉండాలని కిషన్‌రెడ్డి సూచించారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయసహకారాలు అందించాల్సిన బాధ్యత తెలుగువాడిగా తనపైనా ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: కిషన్‌రెడ్డి - ఏపీ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల
దిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప రాష్ట్రపతి కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, హస్తినలోని తెలుగువారు ఈ వేడుకలకు హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా ఏపీ అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కిషన్‌రెడ్డి అన్నారు.