రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణకు 2020-21లో రూ.1,926 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రహదారి, రవాణాశాఖ గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇందులో రూ.1,700 కోట్లు అభివృద్ధికి, రూ.126 కోట్లు నిర్వహణకు కేటాయించినట్లు తెలిపింది. నేషనల్ పర్మిట్ ఫీజు నుంచి రాష్ట్రానికి 2020 నవంబరు వరకు రూ.35.01 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 7,339.95 కిలోమీటర్ల 42 జాతీయ రహదారులున్నట్లు పేర్కొంది. రాయపూర్-విశాఖపట్నం కారిడార్‌లో 340 కిలో మీటర్ల రహదారి పనులను 2020-21లో కేటాయించామని, మిగిలిన 120 కిలో మీటర్ల పనులను 2021-22లో అప్పగిస్తామని నివేదికలో పేర్కొంది. ప్రజారవాణా వ్యవస్థలో మహిళల భద్రతను పెంచడానికి.. నిర్భయ ఫండ్ కింద ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు తెలిపింది.
ఇదీ చదవండి: