Gas Subsidy: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ సిలిండర్ల ధరలూ విపరీతంగా పెరిగిపోయాయి. వాణిజ్య సిలిండర్ ధర అయితే రూ.2000 మార్కును తాకింది. సాధారణ వంట గ్యాస్ సిలిండర్ ధర సైతం వెయ్యికి చేరువైంది. ఇది సామాన్య ప్రజలకు పెనుభారంగా మారింది. ఈ నేపథ్యంలో వంట గ్యాస్ సిలిండరుపై రూ.300 వరకు రాయితీ ఇచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
కొంతకాలం క్రితం వరకు రూ.594కు లభించిన డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర.. ప్రస్తుతం రూ.1000 వరకు పలుకుతోంది. దీనికితోడు గతంలో వచ్చే నగదు రాయితీని కేంద్రం అమాంతం తగ్గించింది. గతంలోని రూ.174 సబ్సిడీని రూ.20 నుంచి రూ.30 మధ్యలో ఇస్తుంది. అయితే తాజాగా రూ.300 వరకు రాయితీ పొందే అవకాశం కల్పించేలా కసరత్తులు చేస్తోంది. అదెలాగంటే..
సబ్సిడీ ఖాతాను ఆధార్ నంబరుతో లింక్ చేయడం వల్ల ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు కలిగేలా చేస్తోంది. ఇలా చేయడం ద్వారా గరిష్ఠ ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొంది. తాజాగా వంట గ్యాస్‌పై వచ్చే రాయితీని రూ.312కు పెంచేలా చర్యలు తీసుకుంటోంది. వినియోగదారులు ఈ ప్రయోజనం పొందాలంటే గ్యాస్ సబ్సిడీ ఖాతాను విధిగా ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి