ETV Bharat / city

భారత్‌ నుంచి ఎంఆర్‌ఎన్‌ఏ టీకా సాంకేతికత.. అభివృద్ధి చేసిన సీసీఎంబీ

CCMB Scientists: భారతీయ శాస్త్రవేత్తలు టీకా సాంకేతికత అభివృద్ధిలో గొప్ప పురోగతి సాధించారు. దేశంలోనే మెసెంజర్ ఆర్​ఎన్​ఏ టీకా సాంకేతికతను తొలిసారి అభివృద్ధి చేశారు. సెంటర్​ ఫర్​ సెల్యూలార్​ అండ్​ మాలిక్యులర్​ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తల బృందం ఈ ఘనతను సాధించింది.​​

ccmb
ccmb
author img

By

Published : May 14, 2022, 12:36 PM IST

భారత్‌ నుంచి ఎంఆర్‌ఎన్‌ఏ టీకా సాంకేతికత .. అభివృద్ధి చేసిన సీసీఎంబీ

CCMB Scientists: సీసీఎంబీ శాస్త్రవేత్తలు పూర్తి దేశీయంగా మెసెంజర్​ ఆర్ఎన్ఏ (ఎంఆర్​ఎన్​ఏ) టీకా సాంకేతికతను తొలిసారి అభివృద్ధి చేశారు. ఈ మేరకు సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి, అటల్ ఇంక్యూబేషన్ సెంటర్ సీఈవో డాక్టర్ మధుసూదన్​ రావు సీసీఎంబీలో మాట్లాడారు. దాదాపు 8 నెలల క్రితం చేపట్టిన ప్రయోగంలో భాగంగా ఇప్పటికే ఎంఆర్ఎన్ఏ సాంకేతికతను వృద్ధి చేయడంతోపాటు సార్స్ కొవిడ్-2ని నియంత్రించే విధంగా ఎంఆర్ఎన్ఏ టీకా క్యాండిడేట్​ని రూపొందించినట్లు వివరించారు. ఈ టీకాను మైస్​లపై ప్రయోగించగా.. సత్ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తి ఉన్న సంస్థలకు ఎంఆర్ఎన్ఏ టీకాలను వృద్ధి చేసేందుకు కావాల్సిన సహకారం అందిస్తామని వారు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి..:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.