ETV Bharat / city

విశాఖ ఘటన: బయటికొచ్చిన సీసీ పుటేజీ దృశ్యాలు - vishaka cc footage news

విశాఖ ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ బయటకు వచ్చింది. సీసీ కెమెరాలో గ్యాస్ పీల్చి పడిపోతున్న వారి విజువల్స్ రికార్డ్ అయ్యాయి.

cc-footage-revealed-of-vishakha-gas-leak

author img

By

Published : May 16, 2020, 10:18 AM IST

Updated : May 17, 2020, 6:43 AM IST

ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరీన్‌ విషవాయువు ప్రభావానికి ప్రజలు అస్వస్థతకు గురైన సీసీటీవీ కెమెరా దృశ్యాలు.. ప్రమాద తీవ్రతను కళ్లకు కట్టాయి. దట్టమైన మంచు కురిసినట్లు పరిశ్రమ నుంచి స్టైరీన్‌ ఆవిర్లు వెంకటాపురం గ్రామంలోకి వ్యాపించిన తీరు ఈ దృశ్యాల్లో ఉంది. వెంకటాద్రినగర్‌కు చెందిన జి.శ్రీనివాస్‌ తన ఇల్లు, కాలనీని అనుసంధానిస్తూ ఏర్పాటుచేసిన మూడు సీసీటీవీ కెమెరాల్లో ఇవి నమోదయ్యాయి. ఈ కెమెరాలున్న వెంకటాద్రినగర్‌ ప్రాంతం.. సరిగ్గా స్టైరీన్‌ ట్యాంకర్ల వెనకే ఉంది. దీంతో ఆ కాళరాత్రి దృశ్యాలు స్పష్టంగా నమోదయ్యాయి.

విశాఖ ఘటన: బయటికొచ్చిన సీసీ పుటేజీ దృశ్యాలు

పిల్లలు, పెద్దలు ఇళ్లు విడిచి పరుగులు పెట్టి.. ఆ వెంటనే కుప్పకూలిపోయారు. కొందరు వాంతులు చేసుకోవడం, సొమ్మసిల్లిపోవడం కూడా ఆ దృశ్యాల్లో ఉంది. లోపలి నుంచి బయటకొచ్చి గేటు తీయడానికీ ఇబ్బంది పడ్డారంటే ఆవిర్ల గాఢత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పిల్లలు కుప్పకూలిన దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. మహిళలు నడుస్తూ రోడ్ల మీదే పడిపోయారు. ఎవరికి వారు ప్రాణాలను అరచేత పెట్టుకొని పరుగులు తీశారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ప్రకారం 7వ తేదీ తెల్లవారుజాము నుంచి ఊళ్లోకి పొగలు వస్తున్నట్లు కనిపించింది. 3-4 గంటల మధ్య స్టైరీన్‌ ఆవిర్లు తక్కువ రాగా, 4-5 గంటల మధ్య దట్టంగా వచ్చినట్లు కెమెరాల్లో నమోదైంది. ఈ సమయంలో బయటకు వచ్చిన వారిలో కొందరు తీవ్ర అస్వస్థతకు గురికాగా, మరికొందరు మరణించారని కాలనీ వాసులు చెబుతున్నారు. ఉదయం 6 గంటల వరకూ గ్రామాన్ని పొగలు వదల్లేదు. ఆ తర్వాత సహాయక బృందాలు వచ్చి, వీధుల్లో పడిపోయిన వారిని వాహనాల్లో తరలించాయి.

ట్యాంకు వెనుకే ఇల్లు..

వెంకటాద్రినగర్‌కు చెందిన జి.శ్రీనివాస్‌ నాటి ఘటనను వివరించారు. ‘మా కాలనీ స్టైరీన్‌ ట్యాంకు వెనుకే ఉంది. తెల్లవారుజామున 3 గంటలకు పొగలు వస్తున్నాయని గ్రామంలోని రంగనాథ్‌ అనే వ్యక్తి నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. ఈ సమస్య ఎప్పుడూ ఉండేదే అని పెద్దగా పట్టించుకోలేదు. క్రమేణా ఆవిర్ల గాఢత పెరగడం, మరిన్ని ఫోన్లు రావడంతో ప్రమాద తీవ్రత అర్థమైంది. ఈ సమయంలో బయటకు వెళ్లే ప్రయత్నం చేయగా బెడ్‌రూం నుంచి హాల్లోకి వెళ్లేసరికే కళ్లు మంటలు పుట్టాయి. అప్పటికే మా ఇంట్లో 8మంది ఉన్నారు. అందరం ఒకే గదిలోకి వెళ్లి తలుపులు మూసేశాం. గాలి రావడానికి అవకాశం ఉన్న మార్గాలన్నీ మూసేశాం. దీంతో గదిలోకి విషవాయువు రాకుండా కొంతవరకు అడ్డుకున్నాం. ఉదయం 6 గంటలకు మా స్నేహితుడు గేట్లు కొట్టి.. లోపలుంటే మరింత ప్రమాదమని చెప్పడంతో ఒక్క ఉదుటున పరుగులు తీశాం. నా స్నేహితుడు మా పిల్లల్ని తీసుకువెళ్లగా, నేను మిగిలిన వారిని కారులో తీసుకుని సుజాతనగర్‌ వైపు వెళ్లా. ఆ తర్వాత పిల్లలు కేజీహెచ్‌లో ఉన్నారని తెలిసి, అక్కడినుంచి మరో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాను.’ అని చెప్పారు.

Last Updated : May 17, 2020, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.