ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల్లోని రాంకీ ఫార్మా సిటీ ఛార్జ్‌షీట్‌లో డిశ్చార్జ్ పిటిషన్‌పై నాంపల్లిలోని సీబీఐ న్యాయస్థానంలో విజయసాయిరెడ్డి తరఫున వాదనలు జరిగాయి. తనను కేసు నుంచి తొలగించాలని కోరుతూ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు అభియోగాల నమోదును కలిపి కోర్టు విచారణ చేపట్టింది. వాదనలు కొనసాగించేందుకు రాంకీ ఫార్మా కేసు విచారణను ఈనెల 11కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు, వాన్‌పిక్ ఛార్జ్‌షీట్ల విచారణ కూడా ఈనెల 11కి న్యాయస్థానం వాయిదా వేసింది. లేపాక్షి నాలెడ్జ్‌హబ్ కేసులో హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున విచారణను జులై 2కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
mp raghurama: అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఎంపీ రఘురామ లేఖ