ETV Bharat / city

లోక్​ఆదాలత్​లో 6,351 కేసుల పరిష్కారం

author img

By

Published : Dec 13, 2020, 3:45 AM IST

రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్​ ఆదాలత్​ల ద్వారా 6వేల 351 కేసులు పరిష్కారమయ్యాయి. కక్షిదారులకు రూ.33.77 కోట్ల పరిహారం అందజేశారు.

cases settelment on Virtual Lok Adalats in AP
లోక్​ఆదాలత్​ ద్వారా 6వేలకుపైగా కేసుల పరిష్కారం

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్‌అదాలత్‌లకు మంచి స్పందన లభించింది. ఒక్కరోజే 6వేల 351 కేసులు పరిష్కారమయ్యాయి. కక్షిదారులకు 33కోట్ల 77లక్షల రూపాయల పరిహారం అందింది. జాతీయ న్యాయసేవాధికార సంస్థ అదేశాల మేరకు రాష్ట్రంలోని న్యాయస్థానాల్లో శనివారం వీడియో లోక్‌ అదాలత్ నిర్వహించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను ఇరువర్గాల మధ్య సామరస్య పూర్వకంగా పరిష్కరించారు. హైకోర్టు ప్రాంగణంలో ఏపీ హైకోర్టు న్యాయ సేవాధికార సంఘం ఆధ్వర్యంలో మూడు ఈ-లోక్ అదాలత్ నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొని మొత్తం 262 కేసుల్ని పరిష్కరించారు.

గుంటూరు జిల్లాలో 1,040 కేసులు పరిష్కారం

గుంటూరు జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్​లో 1,040 పెండింగ్ కేసులు పరిష్కారమయ్యాయి. వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్​లో ఉన్న... రాజీపడదగిన... 221 సివిల్ కేసులు, 791 క్రిమినల్ కేసులు, 28 ఫ్రీ-లిటిగేషన్ కేసులను పరిష్కరించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా 4కోట్ల 85 లక్షల 93 వేల 718 రూపాయల విలువైన కేసులు పరిష్కారమైనట్లు గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ జి.గోపిచంద్ తెలిపారు. మెగా వర్చువల్ లోక్ అదాలత్ నిర్వహణకు కృషి చేసిన న్యాయవాదులు, పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది, కక్షిదారులకు జిల్లా న్యాయమూర్తి గోపిచంద్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.

ఇదీ చదవండి:

తిరుపతి ఉప ఎన్నిక బరిలో భాజపా... సోము వీర్రాజు ప్రకటన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.