మహిళా దినోత్సవం రోజు రాజధాని ప్రాంత మహిళలు, రైతులు ప్రకాశం బ్యారేజీపై నిరసనకు బయలుదేరారు. అడ్డుకున్న పోలీసులు.. వారిని అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ రాజధాని గ్రామాల్లో ఆందోళనలు చేపట్టారు. ముఖ్యంగా మందడం, మల్కాపురం ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి.
రైతులు వెలగపూడిలోని సచివాలయం వైపు వెళ్లేందుకు యత్నించారు. అక్కడ జరిగిన ఆందోళనలకు సంబంధించి ఐపీసీ 143, 188, 332 353, 506, 509, R/W 149 సెక్షన్ల కింద తుళ్లూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఆందోళనకు సంబంధించి పదిహేడు మంది పేర్లను ఎఫ్.ఐ.ఆర్లో చేర్చారు.
ఇదీ చదవండి: అమరావతి మహిళలను పరామర్శించనున్న చంద్రబాబు