ETV Bharat / city

42వ రోజు.. రాజధాని రైతుల పోరు - అమరావతి రైతుల ఆందోళన

రాజధాని రైతుల పోరు 42వ రోజుకు చేరింది. మండలిని రద్దు చేస్తూ సోమవారం శాసనసభ తీర్మానం చేయడంపై భగ్గుమన్న  అమరావతి వాసులు.. ఆందోళనలు మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. నేడు రాయపూడిలో  జలదీక్ష తలపెట్టారు.

42వ రోజు.. రాజధాని రైతుల పోరు
42వ రోజు.. రాజధాని రైతుల పోరు
author img

By

Published : Jan 28, 2020, 6:33 AM IST

అమరావతి కోసం 42వ రోజూ ఆందోళనలు కొనసాగించాలని రైతులు నిర్ణయించారు. మండలిని రద్దు చేస్తూ సోమవారం శాసనసభలో తీర్మానం చేయడంపై భగ్గుమన్న రైతులు... వైకాపా సర్కారు కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్​డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపి తమకు బాసటగా నిలిచిందనే అక్కసుతోనే.. మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేశారని రైతులు, మహిళలు ఆక్షేపించారు.

తుళ్లూరు, ఎర్రబాలెం, వెలగపూడి, మందడంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించిన మహిళలు, రైతులు ....వైకాపా సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తుళ్లూరులో రైతుల ధర్నాకు పలువురు సంఘీభావం తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అణచివేయాలని చూస్తే....ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

అమరావతికి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయన్న మహిళలు...న్యాయపోరాటంలో అంతిమ విజయం తమదేనన్నారు. ప్రభుత్వం మండలి రద్దు తీర్మానం చేసినా.. పార్లమెంట్ ఆమోదం పొందకుండా కేంద్రం క్రీయాశీల పాత్ర పోషించాలని కోరారు. అమరావతికి మద్దతుగా నేడు రాయపూడిలో జలదీక్ష చేస్తామని రైతులు తెలిపారు.

42వ రోజు.. రాజధాని రైతుల పోరు

ఇదీ చదవండి: మండలి రద్దు..! తీర్మానానికి శాసనసభ ఆమోదం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.