మందడం నుంచి అనంతారం వరకు రైతులు పాదయాత్ర - రాజధాని వార్తల పాదయాత్ర న్యూస్
రాజధాని అమరావతి కోసం రైతుల పోరు బాట 39వ రోజు కొనసాగుతోంది. మందడం నుంచి రైతులు, మహిళలు అనంతారం వెంకన్న కొండకు పాదయాత్రగా బయలుదేరారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు మీదుగా ఈ పాదయాత్ర సాగనుంది. వెంకటేశ్వర స్వామికి రాజధాని గ్రామాల రైతులు మొక్కులు చెల్లించనున్నారు.